మార్కులు రాకపోయినా వారికి ఉద్యోగం వచ్చింది.. ఎలా అంటే?

ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతో కస్టపడి రాత్రి పగులు అని తేడా లేకుండా చదివితేనే ఉద్యోగం లభిస్తుంది.

 People Got Dsc Job Without Getting Marks, Marks, Cut Off Marks, Government Job,-TeluguStop.com

కానీ కొందరికి మాత్రం మార్కులు రాకుండానే అనంతపురం జిల్లాలో కొందరికి ఉద్యోగాలు లభించాయి.అలా ఎలా అనుకుంటున్నారా?

అక్కడికే వస్తున్న.అనంతపురం జిల్లాలో గత సంవత్సరం 2019 ఫిబ్రవరి నెలలో 55 పోస్టులకు ప్రత్యేక డీఎస్సీ 2019 పేరుతో నోటిఫికేషన్ విడుదల చేశారు.అయితే 100 మార్కుల రాత పరీక్షలో ఓసీలకు 60 మార్కులు, బీసీలకు 50 మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 మార్కులు కటాఫ్ గా నిర్ణయించారు.

అయితే 2019 జూన్ నెలలో రాత పరీక్ష నిర్వహించగా నవంబర్ లో ఫలితాలు వచ్చాయి.ఓసీ కేటగిరీకి 26 పోస్టులు ఉండగా అందులో ఆరుగురు మాత్రమే అర్హత మార్కులు సాధించారు.

దీంతో నిబంధనల ప్రకారం మిగిలిన 20 పోస్టులకు వచ్చే డీఎస్సీలో భర్తీ చెయ్యాలి.కానీ ఇతర కేటగిరీల వాళ్లను ఓపెన్‌ కేటగిరీ పరిగణించి నియామకం చేపట్టగా ఎలాంటి అర్హత లేకపోయినా వారికి సైతం ఉద్యోగాలు వచ్చాయి.

అయితే ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube