భూమా ఫ్యామిలీ నుండి కొత్త లీడర్ దొరికినట్లేనా..?!  

got a new leader from the bhuma family, bhooma family, akila priya, bhargav reddy, new member, bhooma mounika reddy, new leader - Telugu Akila Priya, Bhargav Reddy, Bhooma Family, Bhooma Mounika Reddy, New Leader, New Member

కర్నూలు రాజకీయ చరిత్రలో భూమా వారి రాజకీయ చరిత్ర కాస్త ఎక్కువ అని చెప్పవచ్చు.ఎన్ని కష్టాలు వచ్చినా.

TeluguStop.com - Got A New Leader From The Bhuma Family

ఎన్ని నష్టాలు వచ్చినా.ఎన్ని పార్టీలు మారిన కర్నూలు జిల్లాలో భూమా వారి రాజకీయ జీవితం ఒడిదుడుకుల మధ్య కొనసాగిందని చెప్పవచ్చు.

అయితే ఓ ద్రువదృష్ట కారణంగా కార్ యాక్సిడెంట్ లో శోభ నాగిరెడ్డి మరణం, ఆ తర్వాత గుండెపోటు కారణంగా భూమా నాగిరెడ్డి మరణించారు.అయితే భూమా శోభా నాగిరెడ్డి స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన భూమా అఖిలప్రియ గత తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కూడా కొనసాగింది.

TeluguStop.com - భూమా ఫ్యామిలీ నుండి కొత్త లీడర్ దొరికినట్లేనా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ సమయంలో మంత్రిగా కొనసాగినా అఖిలప్రియ ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతుంది.భూమా అఖిలప్రియ అరెస్టు కావడంతో కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

హైదరాబాదులో జరిగిన హఫీజ్ భూముల వ్యవహారం, అలాగే కిడ్నాప్ కేసు అంటూ భూమా అఖిలప్రియ అరెస్ట్ అవ్వగా ఆ తర్వాత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.ఇక కిడ్నాప్ కేసులో భాగంగా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడు.

దీంతో భూమా ఫ్యామిలీ మొత్తం పూర్తి గందరగోళంలో పడిపోయింది.అయితే ఇదే సమయంలో భూమా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ కొందరు రాజకీయ నాయకులు వారి కేడర్ పై కన్నేశారు.

భూమా క్యాడర్ ని తమవైపు తిప్పుకునేందుకు వైఎస్ఆర్సిపి నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.

Telugu Akila Priya, Bhargav Reddy, Bhooma Family, Bhooma Mounika Reddy, New Leader, New Member-Latest News - Telugu

ఇందులో భాగంగానే.ఇకపై భూమా ఫ్యామిలీకి సపోర్టు కూడా ఎవరు ఉండరంటు.వారి వర్గీయులను ఇబ్బందులపాలు చేయడానికి కొందరు నాయకులు టార్గెట్ చేస్తున్నట్లు తెలియడంతో దాంతో భూమా ఫ్యామిలీ అలర్ట్ అయింది.

దీంతో వెంటనే వారి క్యాడర్ సంబంధించిన కార్యకర్తలు మీటింగ్ పెట్టి భరోసా కల్పించింది.అయితే ఈ భరోసా కల్పించింది ఎవరో కాదు భూమా నాగిరెడ్డి రెండో కూతురు మౌనిక రెడ్డి.

తాజాగా జరిగిన క్యాడర్ మీటింగ్ లో మౌనిక రెడ్డి మాట్లాడిన మాటలు ఆవిడ ఇచ్చిన భరోసా తో వారి క్యాడర్ ఫుల్ ఖుషీగా ఉందని తెలుస్తోంది.ఆవిడ కు ప్రతి ఈ విషయం పై పూర్తి క్లారిటీ ఉండడం.

ఆవిడ మాట్లాడే ప్రతి పదంలోనూ ఖచ్చితత్వం ఉండడంతో రాబోయే రోజుల్లో మౌనిక రెడ్డి కొత్త లీడర్ గా అవతరిస్తుందని వారి క్యాడర్ భావిస్తోంది.చూడాలి మరి ముందు ముందు మౌనిక రెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాలలో ఏవిధంగా కీలక పాత్ర పోషిస్తుందో.

#New Leader #Bhargav Reddy #New Member #Akila Priya #BhoomaMounika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు