నిహారికది ప్రేమ పెళ్ళంటా.. వెంటపడి మరీ..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులు అంతకంతకూ ఆలస్యమవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సినిమా హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.ఇప్పటికే నాని, నిఖిల్, రానా పెళ్లిళ్లు జరగగా కాజల్, నిహారిక పెళ్లిళ్లు జరగాల్సి ఉంది.

 Gossips Viral Aboutu Niharika Chaitanya Marriage  Rana, Kajal, Niharika, Chaitan-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం గోవాలో బ్యాచిలరేట్ పార్టీ జరుపుకున్న నిహారిక పెళ్లి డిసెంబర్ నెలలో జరగబోతుందని సమాచారం.

నిహారిక పెళ్లి చేసుకోబోయే చైతన్య గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు అని.ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని సమాచారం.అయితే అందరూ నిహారిక చైతన్యల వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం అని భావిస్తుండగా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం నిహారిక చైతన్య ఒకరినొకరు ప్రేమించుకున్నారని.

తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించారని.ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ పెళ్లి జరుగుతోందని తెలుస్తోంది.

కామన్ ఫ్రెండ్స్ ద్వారా నిహారికకు, చైతన్యకు పరిచయం ఏర్పడిందని.నిహారిక వెంటపడి మరీ చైతన్య ఆమె తన ప్రేమను అంగీకరించేలా చేసుకున్నాడని.

చాలా నెలల నుంచి వీళ్లిద్దరూ ఒకరికొకరు పరిచయమని ప్రచారం జరుగుతోంది.అయితే నిహారిక లేదా చైతన్యలలో ఎవరో ఒకరు స్పందించి స్పష్టతనిస్తే మాత్రమే వీళ్ల వివాహం ప్రేమ వివాహమో లేక పెద్దలు కుదిర్చిన వివాహమో తెలిసే అవకాశం ఉంది.

మరోవైపు వివాహం అనంతరం చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలుగా ప్రూవ్ చేసుకున్నారు.

మరోవైపు డిసెంబర్ లో జరగబోయే నిహారిక చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే పెళ్లి కోసం వరుణ్ తేజ్ కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశాడని త్వరలో పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube