ఉప్పెనలో ఊహించని క్లైమాక్స్.. హీరో చనిపోతాడా..?  

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా టీజర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.తొలి సినిమా టీజర్ తోనే వైష్ణవ్ తేజ్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు.

TeluguStop.com - Gossips Viral About Vaishnav Tej Uppena Movie Climax

గతేడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.టీజర్ లో రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా ఈ సినిమా వచ్చే నెల 5న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

స్వచ్చమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది.అయితే టీజర్ చూసిన తరువాత మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు సైతం ఉప్పెన సినిమా ట్రాజెడీ ఎండింగ్ తో తెరకెక్కిందా ? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.టీజర్ చివర్లో వైష్ణవ్ తేజ్ రక్తపు గాయాలతో సముద్రం ఒడ్డున పడి ఉన్నట్లు టీజర్ లో చూపించారు.దీంతో ఈ సినిమాలో హీరో చనిపోతాడా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

TeluguStop.com - ఉప్పెనలో ఊహించని క్లైమాక్స్.. హీరో చనిపోతాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image
Telugu Climax Scene, Kruti Shetty, Uppena Movie, Vaishnav Tej-Movie

సాధారణంగా హీరోలు తొలి సినిమా రిస్క్ లేకుండా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కే విధంగా జాగ్రత్త పడతారు.అయితే వైష్ణవ్ తేజ్ మాత్రం తొలి సినిమాలోనే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంచుకోవడం గమనార్హం.టీజర్ తోనే మెప్పించిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే స్టార్ హీరో అనిపించుకుంటాడని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గుండెలకు హత్తుకునే ప్రేమకథతో ఈ మధ్య కాలంలో సినిమాలేవీ రాలేదు.

గోదావరి జిల్లా ఉప్పాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబు సుకుమార్ సహాయకుడు కావడం గమనార్హం.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

.

#Kruti Shetty #Vaishnav Tej #Climax Scene

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు