నాగార్జున సినిమాలో నాగచైతన్యకు ఛాన్స్ లేదా..?

స్టార్ హీరో నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలో నాగార్జున రెండు వేర్వేరు పాత్రల్లో నటించి మెప్పించారు.

 Gossips Viral Nagarjuna Son Naga Chaitanya Not Acting In Bangarraju Movie, Naga-TeluguStop.com

సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కనున్నట్టు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రకటన వెలువడింది.త్వరలో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది.

త్వరలో నాగార్జున బంగార్రాజు సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడని సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.అయితే బంగార్రాజు సినిమా గురించి వార్తలు వచ్చిన సమయంలో ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటించనున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు చైతన్య ఈ సినిమాలో నటించడం లేదని చైతన్యకు బదులుగా మరో హీరో ఈ సినిమాలో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.

Telugu Bangarraju, Kalyan Krishna, Gossips, Naga Chaitanya, Nagarjuna, Prequel,

అయితే బంగార్రాజు సినిమా పట్టాలెక్కితే మాత్రమే చైతన్య ఈ సినిమాలో నటిస్తాడో లేదో అనే విషయం తెలుస్తుంది.నాగార్జున, నాగచైతన్య మనం సినిమాలో నటించగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ప్రేమమ్ సినిమాలో కూడా నాగార్జున కొన్ని నిమిషాల పాటు నటించగా ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం గమనార్హం.

నాగార్జున, చైతన్య కలిసి నటించిన సినిమాలు హిట్ కావడంతో వీళ్లిద్దరూ కలిసి మరో సినిమాలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాగచైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.బంగార్రాజు సినిమాలో చైతన్య నటిస్తున్నాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

మరోవైపు నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఓటీటీలో విడుదలవుతుందో థియేటర్లలో విడుదలవుతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube