బాలీవుడ్ రీమేక్ పై కన్నేసిన బాలయ్య.. తెలుగుపై ప్రేమతో..?  

gossips viral about balakrishna acting in telugu medium movie, bollywood remake, angrezi medium, telugu medium, balakrishna, gopichand malineni, boyapati, god father, bb3 - Telugu Angrezi Medium, Balakrishna, Bb3, Bollywood Remake, Boyapati, God Father, God Father Movie, Gopichand Malineni, Gossips Viral, Telugu Medium, Telugu Medium Movie

లెజెండ్ తరువాత సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేని బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఇంకా పేరు పెట్టని సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ వినిపిస్తుండగా ఈ టైటిల్ నే ఫిక్స్ చేస్తారో లేక మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తారో తెలియాల్సి ఉంది.

TeluguStop.com - Gossips Viral About Balakrishna Acting In Telugu Medium Movie

ఈ సినిమా తరువాత క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ నటించబోతున్నారు.వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న రవితేజను గోపీచంద్ మలినేని క్రాక్ మూవీలో పవర్ ఫుల్ గా చూపించి హిట్ ఇచ్చారు.

క్రాక్ సినిమాలా బాలకృష్ణకు కూడా గోపీచంద్ మలినేని బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే ఈ సినిమాలతో పాటు బాలకృష్ణ బాలీవుడ్ లో హిట్టైన అంగ్రేజీ మీడియం‌ సినిమా రీమేక్ లో కూడా నటించబోతున్నారని తెలుస్తోంది.

TeluguStop.com - బాలీవుడ్ రీమేక్ పై కన్నేసిన బాలయ్య.. తెలుగుపై ప్రేమతో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తెలుగు మీడియం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని.తెలుగు భాషపై ప్రేమాభిమానాలను కలిగి ఉన్న బాలకృష్ణ తో ఈ సినిమాను తెరకెక్కించాలని కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరి బాలకృష్ణ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.నిర్మాతలు ఈ సినిమాలోని పాత్రకు బాలకృష్ణ తప్ప మరే నటుడు సరిపోరని భావిస్తున్నట్టు సమాచారం.స్పష్టంగా తెలుగు మాట్లాడే బాలకృష్ణ చాలా సందర్భాల్లో తెలుగు భాష గొప్పదనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.బాలయ్య తెలుగు భాష విశిష్టతను తెలిపే తెలుగు మీడియంలో నటిస్తే బాలయ్య సినీ కెరీర్ లో ఆ సినిమా ప్రత్యేక సినిమాగా నిలిచే అవకాశం ఉంటుంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా మే 28వ తేదీన విడుదల కానుంది.

రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ మూవీ కూడా అదే డేట్ కు విడులవుతున్నట్టు ప్రకటన వెలువడగా బాలయ్య, రవితేజలలో ఎవరో ఒకరు తమ సినిమాల రిలీజ్ డేట్ లను మార్చుకుంటారేమో చూడాల్సి ఉంది.

#Angrezi Medium #TeluguMedium #Balakrishna #Boyapati #God Father

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు