ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌ లుక్‌పై పుకార్లే పుకార్లు  

  • టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం కథ ఏంటీ, ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ ల పాత్రలు ఏంటీ అనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయినా కూడా ఈ చిత్రం గురించి సోషల్‌ మీడియాలో రక రకాలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా షూటింగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్‌ లుక్‌ కాస్త విభిన్నంగా ఉంది. దాంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ చాలా లావుగా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతుంది.

  • Gossips On Ntr Look In RRR Movie-Rajamouli Ram Charan Rrr Movie

    Gossips On Ntr Look In RRR Movie

  • ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో బాడీ బిల్డర్‌గా కనిపించబోతున్నాడు అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కథ పూర్తి అయ్యిందని, త్వరలోనే హీరోయిన్స్‌ ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ లుక్‌ గురించిన కథనాలు సోషల్‌ మీడియాలో సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున ఈ చిత్రం రూపొందుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ దాదాపు సంవత్సర కాలం పాటు ఈ చిత్రం కోసం డేట్లు ఇచ్చాడట. ఆ సంవత్సరం పాటు కూడా ఎన్టీఆర్‌ చాలా కఠినమైన డైట్‌ ను ఫాలో అవ్వబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

  • Gossips On Ntr Look In RRR Movie-Rajamouli Ram Charan Rrr Movie
  • కథానుసారంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ చాలా లావుగా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ విలన్‌ గా కనిపించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ను నందమూరి అభిమానులు విలన్‌గా ఒప్పుకోరు. అందుకే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ హీరోగానే నటిస్తాడని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్‌ పాత్ర గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.