ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.. ఆ ఫోటో వల్ల అనుమానాలు..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించబోతున్నారు.ఈ రెండు సినిమాల తరువాత ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సానా, త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 Gossips Goes Viral About Ntr Political Entry-TeluguStop.com

ఎన్టీఆర్ 2015 సంవత్సరంలో విడుదలైన టెంపర్ సినిమా నుంచి నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఎన్టీఆర్ గత సినిమా అరవింద సమేత 88 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

 Gossips Goes Viral About Ntr Political Entry-ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.. ఆ ఫోటో వల్ల అనుమానాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు కొన్నేళ్ల క్రితం వరకు జూనియర్ ఎన్టీఆర్ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు ఆ పార్టీ గెలుపు కోసం ఎంతగానో శ్రమించారు.అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండగా మళ్లీ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ కావాలని టీడీపీ కార్యకర్తలు, నేతలు బలంగా కోరుకుంటున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తరువాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఫలితాలను అందుకుంది.తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో సైతం టీడీపీ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు.

అయితే ఉగాది పండుగ కానుకగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజైంది.ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ పసుపు రంగు రిబ్బన్ కట్టుకుని కనిపించారు.ఎన్టీఅర్ అలా కనిపించడం అతని పొలిటికల్ ఎంట్రీకి సంకేతమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని ఆకాంక్షించే ఫ్యాన్స్ సైతం ఆ ఫోటోకు లైక్ కొట్టడంతో పాటు ఫ్యాన్స్ పేజీలలో షేర్ చేస్తున్నారు.

మరి ఎన్టీఆర్ నిజంగా టీడీపీలో యాక్టివ్ అవుతారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

#Clarity

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు