తారక్ త్రివిక్రమ్ మూవీ.. అప్పటివరకు ఆగాల్సిందే..?

అరవింద సమేత వీరరాఘవ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరిగింది.ఆ ప్రచారం ఎట్టకేలకు నిజమై ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కుతున్నట్టు ప్రకటన వెలువడింది.

 Gosiips Goes Viral About Tarak Trivikram Movie-TeluguStop.com

ఈ సినిమా టైటిల్స్, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ కు సంబంధించి వార్తలు వచ్చాయి.అయితే గత మూడు రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కు బదులుగా కొరటాల శివతో తరువాత సినిమా చేయబోతున్నారని త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో గాసిప్స్ జోరుగా గుప్పుమంటున్నాయి.వైరల్ అవుతున్న వార్తలపై ఈ సినిమా నిర్మాతలలో ఒకరు నిజం లేదని స్పష్టతనిచ్చినా పుకార్లు మాత్రం ఆగడం లేదు.

ఎన్టీఆర్ లేదా త్రివిక్రమ్ స్పందిస్తే వైరల్ అవుతున్న గాసిప్స్ లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.

 Gosiips Goes Viral About Tarak Trivikram Movie-తారక్ త్రివిక్రమ్ మూవీ.. అప్పటివరకు ఆగాల్సిందే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్రివిక్రమ్ కు కరోనా సోకినట్టుగా ప్రచారం జరుగుతుండగా ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అల వైకుంఠపురములో సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమా కోసమే త్రివిక్రమ్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదు.ఎవరూ స్పందించకపోతే మాత్రం ఉగాది పండుగ నాడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఉంటుందో లేదో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఉగాదికి వస్తుందని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది.మరికొన్ని రోజులు ఆగితే ఈ ప్రాజెక్ట్ ఆగుతుందో లేదో స్పష్టత వస్తుంది.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఆగితే మాత్రం భవిష్యత్ లో ఈ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశాలు అవకాశాలు ఉండవని ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#NtrTrivikram #NTR 30

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు