హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ నిరంకుశ అవినీతికి పాలనకు చరమగీతం పాడాలంటే కొత్త నాయకత్వం అవసరంమని తెలిపారు.
దక్షిణ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ లో కొన్ని లక్షల మందికి శిక్షణ ఇచ్చిన ఆలే శ్యామ్ జీ నీ రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ రాష్ట్ర బిజెపి నాయకత్వానికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.ఈయన టైగర్ నరేంద్ర సోదరుడు, ఆర్ఎస్ఎస్ విభాగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బిజెపి పార్టీలో తీవ్ర కలకలం లేపుతున్నాయి.
శ్యామ్ జీ దగ్గర శిక్షణ పొందిన వారిలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు, జర్నలిస్టులు, మరి ఇతర విభాగాల్లో ఎంతోమంది కీలక పాత్ర పోషిస్తున్నారు.
శ్యామ్ జీ లాంటి ప్రచారక్ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని రాజాసింగ్ తెలిపారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లాంటి నాయకులు శ్యామ్ జీ వద్దనే శిక్షణ తీసుకున్నారని, వారిని వెంటనే రాజకీయాల్లోకి తీసుకురావడానికి కృషి చేయాలని రాజసింగ్ ఆకాంక్షించారు.