ఆ సూపర్ హిట్ వెబ్ సిరీస్ వాళ్ళ మనోభావాలు దెబ్బ తీసింది  

Gorkha Group Anushka Sharma - Telugu Amazon Prime, Bollywood, Gorkha Group Files Nhrc Complaint Against Anushka Sharma, Indian Cinema, Tollywood

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాణ సారధ్యంలో పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ లలో బెస్ట్ అనే ప్రశంసలు ఇది అందుకుంది.

 Gorkha Group Anushka Sharma

బాలీవుడ్ సెలబ్రిటీ ప్రముఖులు ఈ వెబ్ సిరీస్ చూసి పొగిడేస్తున్నారు.ఇంత గొప్ప వెబ్ సిరీస్ ఇప్పటి వరకు చూడలేదని అంటున్నారు.

అయితే తాజాగా ఊహించని విధంగా ఈ వెబ్ సిరీస్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది.

ఆ సూపర్ హిట్ వెబ్ సిరీస్ వాళ్ళ మనోభావాలు దెబ్బ తీసింది-Movie-Telugu Tollywood Photo Image

ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్ సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు.

తమ గూర్ఖా సమాజాన్ని అవమానకరంగా చిత్రీకరించారని ఫిర్యాదులో ఆరోపించారు.

రెండో ఎపిసోడ్ లో తమను కించపరిచే విధంగా ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారని తెలిపారు.ఆ సీన్ లో వచ్చే డైలాగ్స్ మ్యూట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో అనుష్కశర్మకు గూర్ఖా సమాజానికి చెందిన వారు హెచ్చరికలు జారీ చేశాయి.అనుష్కపై న్యాయపరమైన పోరాటం చేస్తామని తెలిపారు.

ఈ మధ్య కాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఒక వర్గాన్ని ఏ మాత్రం తగ్గించే విధంగా ఉన్న ఆ వర్గం వారు తమకి అవమానం జరిగింది అంటూ కోర్టులకి వెళ్ళడం సారా మామూలు అయిపొయింది.అయితే దీని వెనుక ఒక్కోసారి నెగిటివ్ ప్రమోషన్ కోసం నిర్మాతలే చేస్తారనే అపవాదు ఉండగా, కొన్ని సార్లు చిన్న విషయాన్ని కాష్ చేసుకోవడానికి కొంత మంది కావాలనే ఇలా తమకి అవమానం జరిగింది అంటూ గగ్గోలు పెడతారనే మాట గట్టిగా వినిపిస్తుంది.

మరి ఇప్పుడు గూర్ఖాల గొడవ ఏ కోవలోకి వస్తుంది అని వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gorkha Group Anushka Sharma Related Telugu News,Photos/Pics,Images..

footer-test