వైరల్‌ వీడియో : మనిషి జంతువు నుండి వచ్చాడనేందుకు ఇదే సాక్ష్యం  

Gorillas Making A Run For It In The Rain. Especially The Expressions-gorillas,monkeys,social Media

కోతి నుండి మనిషి పుట్టుకు వచ్చాడంటూ మనం చిన్నప్పటి నుండి పుస్థకాల్లో చదువుకోవడం లేదంటే పెద్దలు చెబుతుంటే వినడం జరిగింది.కొన్ని లక్షల ఏళ్ల క్రితం మనిషి పూర్తిగా జంతువు మాదిరిగా ఉండేవాడు.కోతి ఆకారంలో కోతి జాతికి చెందిన ఒక తెగగా మనిషి ఉండేవాడు.కోతిలు, గొరిల్లాల మాదిరిగా మనిషి కూడా జీవనం సాగించే వాడు.కోతులు మరియు గొరిల్లాలకు మనుషులకు ఉన్న తెలివి, ప్రవర్తన ఎక్కువ ఉంటాయని గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది.

Gorillas Making A Run For It In The Rain. Especially The Expressions-gorillas,monkeys,social Media-Gorillas Making A Run For It In The Rain. Especially Expressions-Gorillas Monkeys Social Media

తాజాగా ఈ వీడియో ఆ విషయాన్ని నిర్ధారిస్తుంది.

Gorillas Making A Run For It In The Rain. Especially The Expressions-gorillas,monkeys,social Media-Gorillas Making A Run For It In The Rain. Especially Expressions-Gorillas Monkeys Social Media

ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో గొరిల్లాలు అచ్చు మనుషుల మాదిరిగా ప్రవర్తించడం జరిగింది.వాటిని చూస్తే నిజంగా మనుషులు జంతువుల నుండి వచ్చాయనిపిస్తుంది.గొరిల్లాలు మనుషులకు చాలా దగ్గర సంబంధాలు, పోలికలను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది.దక్షిణ కరోలినాలోని ఒక జూలో ఈ సంఘటన జరిగింది.అక్కడ భారీగా వర్షం కురుస్తుంది.ఆ వర్షం దాటికి గొరిల్లాలు మనుషుల మాదిరిగా వర్షంలో తడవకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాయి.

వాటి పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వర్షంలో తడవకుండా చాటుగా దాక్కున్నాయి.

జూలో వందలాది మంది ఉన్న సమయంలో హఠాత్తుగా వర్షం మొదలైంది.ఆ వర్షంతో ఆరు బయట సంచరిస్తున్న కొన్ని గొరిల్లాలు గోడ వెంబడి వచ్చాయి.వర్షం పడని చోట అవి నిల్చున్నాయి.ఆడ గొరిల్లాలు తమ పిల్లలను గుండెలకు హత్తుకుని వాటికి రక్షణ కల్పిస్తున్నాయి.ఇక మగ గొరిల్లాలు చాలా కేర్‌ లెస్‌గా ఉన్నాయి.మనుషుల్లో కూడా పిల్లలను ఎక్కువగా ఆడవారు సాకుతుంటే, మగవారు మాత్రం కేర్‌లెస్‌గా ఉంటారు.

గొరిల్లాలో కూడా అదే పద్దతి కనిపించింది.ఇక వర్షం తగ్గదని గుర్తించిన గొరిల్లాలు తమ గుహ వద్దకు వెళ్లేందుకు పడ్డ తాపత్రయం కూడా అందరిని ఆకర్షించింది.గోడ వెంబడి చాలా జాగ్రత్తగా నీటి చుక్క తగలకుండా వెళ్లేందుకు ప్రయత్నించాయి.వర్షం చినుకులు పైన పడ్డ సమయంలో వాటి మొహంలోని హావ భావాలు కూడా అచ్చు మనిషి హావభావాల మాదిరిగానే ఉన్నాయి.

మనుషులు ఎక్కువ శాతం వర్షంలో తడిచిన సమయంలో ముక్కులు ఇరుస్తూ మొహం అంతా ఒక రకంగా పెడతాం.అలాగే గొరిల్లాలు కూడా అచ్చు అలాగే ప్రవర్తించాయి.దీంతో గొరిల్లాలకు మనుషులు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని వీడియో చూసిన వారు అంటున్నారు.

మీరు ఈ వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేయండి.