మనుషుల నుంచి గొరిల్లాలకి కరోనా... అమెరికాలో మొదటిసారి  

Gorillas Diagnosed With COVID-19, Corona Effect, America, Corona New Stain, Corona Virus - Telugu America, Corona Effect, Corona New Stain, Corona Virus

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరూ ప్రత్యక్షంగా చూసిన సంగతి అందరికి తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు.

TeluguStop.com - Gorillas Diagnosed With Covid 19

లక్షాలాది ప్రజలు మృత్యవాత పడ్డారు.కరోనా ప్రతి ఒక్కరిని భయపెట్టింది.

మనం సృష్టించిన విద్వంసం మనల్ని భయపెట్టి భవిష్యత్తు గురించి కచ్చితమైన జాగ్రత్తలు చెప్పింది.ఈ ప్రపంచంలో మనిషి అనేవాడు ఎప్పటికి అతీతుడు కాలేడని, ఈ ప్రకృతితో పెట్టుకుంటే ఎ రూపంలో అయినా తన ప్రభావం చూపిస్తుందని మరోసారి రుజువు చేసింది.

TeluguStop.com - మనుషుల నుంచి గొరిల్లాలకి కరోనా… అమెరికాలో మొదటిసారి-General-Telugu-Telugu Tollywood Photo Image

చాలా మంది మనుషుల ఆలోచన విధానాలని ఈ కరోనా వైరస్ మార్చేసింది.జంతువుల నుంచి మనుషులకి సోకినా ఈ కరోనా వైరస్ ఇప్పటి వరకు మనుషులలోనే వ్యాప్తి చెందింది.

జంతువుల వరకు వెళ్ళలేదు.వెళ్ళే అవకాశం లేదని అందరూ భావించారు.

ఇక కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ కొత్త శక్తి నింపుకొని మనపై తన దాడిని కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా వైరస్ బారిన జంతువులు కూడా పడ్డాయి.

అమెరికాలోని సాన్ డియాగో జూ పార్క్‌లో ఉన్న ఎనిమిది గొరిల్లాల‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.మ‌నిషి నుంచే ఆ వైర‌స్ జంతువుల‌కు పాకిన‌ట్లు తెలుస్తోంది.వాస్త‌వానికి ముందు ఓ గొరిల్లాకు వైర‌స్ సంక్ర‌మించింది.ఆ త‌ర్వాత వైర‌స్ మిగిలిన వాటికి వ్యాపించిన‌ట్లు గుర్తించారు.గొరిల్లాల్లో క‌రోనా ల‌క్ష‌ణాల‌ను కూడా ప‌సిక‌ట్టారు.శ్వాస‌కోస ఇబ్బందులు పడుతున్న‌ట్లు తేల్చారు.

ద‌గ్గ‌డంతో పాటు సీరియ‌స్‌గా నీర‌సించిన‌ట్లు అధికారులు గుర్తించారు.జంతువుల మ‌లాన్ని ప‌రీక్షించిన త‌ర్వాత గొరిల్లాల‌కు వైర‌స్ వ్యాపించిన‌ట్లు జూ అధికారులు తెలిపారు.

అమెరికాకు చెందిన వెటిరిన‌రీ స‌ర్వీసెస్ ల్యాబ‌రేట‌రీస్ సోమ‌వారం రిపోర్ట్‌ను వెలువ‌రించింది.మనుషుల జెనిటిక్ కోడ్ కి గొరిల్లాలు దగ్గరగా ఉండటంతో కరోనా వైరస్ వాటి మీద కూడా ప్రభావం చూపించినట్లు తెలుస్తుంది.

.

#Corona Effect #America #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు