వీడియో : గొరిల్లాకు మనుషులకు దగ్గర పోలికలు ఉంటాయి, ఇది మరో సాక్ష్యం  

Gorilla Video Says How Leader Should Be Protect There People - Telugu Gorilla, , Gorilla Video Viral In Social Media, Gorllia Dna And Humans Dna Matching 99 Perecent, Trained Gorilla\\'s

ఈ సృష్టిలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి.అందులో ఒక జంతువు మనిషి అని చెప్పడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు.

Gorilla Video Says How Leader Should Be Protect There People

ఎన్నో జంతువుల మాదిరిగానే మనం ఈ సృష్టిలో జీవిస్తున్నాం.అయితే మనుషులకు తెలివి ఎక్కువగా ఉంటుంది.

మనుషు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు టెక్నాలజీ పరంగా ఎదగడం వల్ల జంతువుల్లో కలిసి ఉండే మనిషి కాస్త ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు.అయితే మనుషుల డీఎన్‌ఏతో జంతువుల్లో కొన్నింటికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి.

ఈ విషయాన్ని ప్రముఖ శాస్త్రవేత్తలు గుర్తించారు.

గొరిల్లా మరియు మనిషి డీఎన్‌ఏ దాదాపుగా 99 శాతం మ్యాచ్‌ అవుతుందని గతంలో శాస్త్రవేత్తలు నిర్థరించారు.గొరిల్లాను కాస్త జాగ్రత్తగా చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది.గొరిల్లాలను ట్రైనింగ్‌ ఇస్తే మనుషులు చేసే పనులు చేయగలవు.

ఈ విషయం ఇంకా నమ్మని వారికి మరో ఉదాహరణగా ఈ వీడియో నిలుస్తుంది.ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక లీడర్‌ గొరిల్లా ప్రవర్తించిన తీరు మనుషులు కూడా తల దించుకునేలా చేస్తుంది.

లీడర్‌ అనే వాడు ముందు నడవాలి, అలాగే ఏదైనా ఆపద వస్తే దాన్ని అడ్డుకునేందుకు నిలబడి తన వారిని ముందుకు నడిపించాలి.అలా ఈ గొరిల్లా చేసింది.పొదల్లోంచి బయటకు వచ్చిన సమయంలో అన్నింటికంటే ముందు వచ్చిన ఈ గొరిల్లా రోడ్డు మీదకు రాగానే ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అనే ఉద్దేశ్యంతో అక్కడే ఆగి అన్నింటిని రోడ్డు దాటించింది.అన్ని గొరిల్లాలు క్రమశిక్షణగా రోడ్డు దాటిన తర్వాత ఆ గొరిల్లా కూడా రోడ్డు దాటి వెళ్లింది.

లీడర్‌ అనేవాడు ఇలా ఉండి తన వారిని ముందుకు నడిపించాలంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు

Gorilla Video Says How Leader Should Be Protect There People-,gorilla Video Viral In Social Media,gorllia Dna And Humans Dna Matching 99 Perecent,trained Gorilla\\'s Related....