తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో గోర‌టి వెంక‌న్న‌… లిస్ట్ చాలా ఉందే…!  

goreti venkana name in telangana mlc list, telanagana, MLC list, goreti venkana, TRS, rajasekhar reddy, narasimha reddy, prabhakar. mp seats - Telugu Goreti Venkana, List, Mlc, Narasimha Reddy, Prabhakar.mp Seats, Rajasekhar Reddy, Telanagana, Telangana Mlc List, Trs

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.గవర్నర్‌ కోటాలో మూడు ఖాళీలు ఉన్నాయి.

TeluguStop.com - Goreti Venkana Name In Telangana Mlc List

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వీటిల్లో ఒక‌టి రాముల్‌నాయ‌క్ ఖాళీ చేసిన స్థానం కాగా, మ‌రొక‌టి మాజీ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిది, మూడోది క‌ర్నె ప్ర‌భాక‌ర్‌ది.ఈ మూడు స్థానాల్లో ప్ర‌భాక‌ర్‌కు ఒక స్థానం గ్యారెంటీయే అంటున్నారు.

TeluguStop.com - తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో గోర‌టి వెంక‌న్న‌… లిస్ట్ చాలా ఉందే…-Political-Telugu Tollywood Photo Image

ఇక రెండో విష‌యంలోనూ నాయిని న‌ర్సింహారెడ్డికే ద‌క్క‌వ‌చ్చ‌ని అంటున్నా.చివ‌ర్లో ఏదైనా స‌మీక‌ర‌ణ‌లు మారితే నాయినికి నిరాశ తప్ప‌ద‌నే అంటున్నారు.

ఇప్ప‌టికే ఆయ‌న కేసీఆర్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.ఈ క్ర‌మంలో నాయినికి మ‌ళ్లీ ఎమ్మెల్సీ ఉంటుందా ?  లేదా ? అన్న‌దానిపై పెద్ద స‌స్పెన్సే నెల‌కొంది.

ఇక మూడో స్థానం కోసం మాత్రం పార్టీలో విప‌రీత‌మైన పోటీ నెల‌కొంది.మ‌హ‌బూబాబాద్‌ మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ లిస్టులో మాజీ స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి, తుల ఉమ‌, గుండు సుధారాణి, పిడ‌మ‌ర్తి ర‌వి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, చాడ కిషన్‌రెడ్డి, ఆర్‌.సత్యనారాయణ, జి.దేవీప్రసాదరావు లాంటి నేత‌ల పేర్లు లైన్లో ఉన్నాయి.ఇక కేసీఆర్ మ‌దిలో మాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ న‌ర‌సింహారావు కుమార్తె సురభి వాణిదేవి పేరు ఉందంటున్నారు.

గోర‌టి వెంక‌న్న‌కు ఛాన్స్ ఉందా.?

ఈ మూడు స్థానాల్లో ఒక్క సీటు ఎస్సీ, ఎస్టీల‌కు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న కూడా ఉందంటున్నారు.అందుకే ఎస్సీ వ‌ర్గానికి చెందిన గోర‌టి వెంక‌న్న పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.ఇటీవ‌ల ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కూడా క‌లిశారు.గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆయ‌న్ను ఎమ్మెల్సీకి నామినేట్ చేయించ‌వ‌చ్చంటున్నారు.వెంక‌న్న త‌న పాట‌లు, రాత‌ల‌తో తెలంగాణ ఉద్య‌మానికి ముందు నుంచి వెన్నుద‌న్నుగానే ఉన్నారు.

ఇక కేసీఆర్‌ను ఆయ‌న ఎప్పుడూ  బ‌లంగా వ్య‌తిరేకించిన సంద‌ర్భాలు కూడా లేవు. కేసీఆర్ ఎస్సీల‌కు ఎమ్మెల్సీ ఇవ్వాల‌నుకుంటే వెంక‌న్న మండ‌లికి వెళ్ల‌డం ఖాయ‌మైన‌ట్టే.!

ఇక వెంక‌న్న‌కు 2004 ఎన్నిక‌ల‌కు ముందే మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డి సిద్ధిపేట ఎంపీ సీటు ఇవ్వాల‌ని భావించారు.ఈ విష‌యాన్ని వెంక‌న్నే స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఏదేమైనా మూడు ఎంపీ సీట్ల కోసం టీఆర్ఎస్‌లో చాలా పోటీ ఉంది.మ‌రి మండ‌లికి వెళ్లే ఆ ముగ్గురు అదృష్ట‌వంతులు ఎవ‌రో ?  చూడాలి.

#Narasimha Reddy #List #Telanagana #Goreti Venkana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Goreti Venkana Name In Telangana Mlc List Related Telugu News,Photos/Pics,Images..