ఆ కారు లైట్ వెయిట్.. రేటు చూస్తేనే కళ్ళు తిరుగుతాయి!

కొన్ని కార్లు అంతే.చూస్తే చాలు కొనేయాలి అనిపిస్తాయి.

 The Gordon Murra, Super Car, Weighs 986 Kg, 23 Crore Rupees-TeluguStop.com

కానీ రేటు చూస్తే గుండె బరువెక్కుతుంది.ఇంకా అలానే చూడటానికి ఎంత అందంగా, అద్భుతంగా ఉన్న ఓ కారు చాలా అంటే చాలా లైట్ వెయిట్.

కానీ కారు ధర మాత్రం భారీగా ఉంది.ఏ కారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

సూపర్ కార్ల తయారీ కంపెనీ గోర్డన్ ముర్రా ఆటోమోటీవ్ సరికొత్త సూపర్ కారును తీసుకువచ్చింది.డ్రైవింగ్ పిచ్చి, కార్ల పిచ్చి ఉన్న వారి కోసమే ఈ కారు తయారు చేసినట్టు కంపెనీ తెలిపింది.ఈ కారుకు టి.50 అని పేరు పెట్టారు.చూడటానికి రేసింగ్ కారుల ఉన్నప్పటికి ప్రతిరోజు కారును ఉపయోగించేలా డిజైన్ చేశారు.అయితే ఈ కారు బరువు టన్నులోపు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

సూపర్ కారు బరువు మొత్తం 986 కిలోలు మాత్రమే ఉంది.ఇంకా ఈ కారులో 4.0లీటర్ వీ12 కాస్ వర్త్ వంటి అత్యంత శక్తివంతమైన ఇంజిన్ ను అమర్చారు.ఈ కారుకు 6 స్పీడ్ మాన్యూవల్ గేర్ బాక్స్ ను ఇచ్చారు.

ఇలాంటి కార్లు కేవలం వందమాత్రమే తయారు చేస్తాం అని సంస్ద పేర్కొంది.అంత బాగున్నప్పటికి ఈ కారు ధరనే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.కారు ధర 2.3 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.23 కోట్లు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube