గోపీచంద్‌కు కెరీర్‌పై ఇంకా ఇంతగా ఆశలు ఉన్నాయా?

హీరోగా సినీ కెరీర్‌ ను ప్రారంభించిన గోపీచంద్‌ మొదట్లో సక్సెస్‌ లేకపోవడంతో విలన్‌ వేషాలు వేశాడు.వరుసగా విలన్‌గా సక్సెస్‌ అవ్వడంతో మళ్లీ హీరోగా మారాడు.

 Gopichand, Movies, Rajinikanth,villain Roles, Hero-TeluguStop.com

హీరోగా ఈయన చేస్తున్న సినిమాలు ఈమద్య కాలంలో తీవ్రంగా నిరాశ పర్చుతున్నాయి.ఒకొక్కటిగా సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్నాయి.

ఈ సమయంలో ఈయనకు ఆఫర్లు రావడం కష్టం అవుతుంది.అయినా కూడా హీరోగానే నటిస్తానంటూ భీష్మించుకు కూర్చుంటున్నాడు.
ఇటీవల ఈయన్ను దర్శకుడు తేజ ఒక సినిమాలో విలన్‌ పాత్రకు గాను అడిగాడట.కాని అందుకు గోపీచంద్‌ ఒప్పుకోలేదని సమాచారం అందుతోంది.అలాగే దర్శకుడు శివ ఈయన్ను రజినీకాంత్‌ సినిమాలో విలన్‌ పాత్రకు అడిగాడట.అందుకు కూడా నో చెప్పాడని సమాచారం అందుతోంది.

ఇలాంటి పెద్ద ఆఫర్లను తిరష్కరించిన గోపీచంద్‌ సమయం వృదా చేసుకుంటున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.గతంలో మాదిరిగా ప్రస్తుతం పరిస్థితి లేదు.

మళ్లీ గోపీచంద్‌ హీరోగా సక్సెస్‌ కొట్టే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Gopichand, Rajinikanth, Villain-

ఇలాంటి సమయంలో వచ్చిన అవకాశంను వినియోగించుకుని సినిమాలు చేస్తూ నాలుగు రోజుల పాటు ఇండస్ట్రీలో ఉంటే మంచిదని గోపీచంద్‌కు సలహాలు ఇస్తున్నారు. గోపీచంద్‌ మాత్రం కెరీర్‌పై ఆశలు పెట్టుకుని అది కూడా హీరోగా ఆశలు పెట్టుకుని సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు.కేవలం హీరోగానే సినిమాలు చేస్తానంటే మరో రెండేళ్ల తర్వాత గోపీచంద్‌ను అంతా మర్చి పోయే అవకాశం ఉందని సినీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube