ఎఫ్3లో మ్యాచో స్టార్.. నిజమేనా?

టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 Gopichand To Star In F3, Gopichand, F3, Venkatesh, Varun Tej, Anil Ravipudi-TeluguStop.com

ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.కాగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.

వారిద్దరి కాంబో ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవడంతో ఈసారి ఎఫ్3లో ఇంకెలాంటి హైలైట్‌లు ఉండబోతున్నాయా అని అందరూ ఆలోచిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరో నటించబోతున్నట్లు గతకొద్ది రోజులుగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తాడని గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఈ సినిమాలో మరో హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ సినిమాలో ఓ కేమియో రోల్‌లో నటిస్తాడని తెలుస్తోంది.ఇటీవల సీటీమార్ చిత్ర సెట్స్‌లో గోపీచంద్‌ను కలిసి ఈ మేరకు చర్చలు జరిపాడట దర్శకుడు అనిల్ రావిపూడి.

దీంతో ఈ సినిమాలో నటించేందుకు గోపీచంద్ కూడా వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం వరుస ఫెయిల్యూ్ర్స్‌తో ఫేడవుట్ అవుతున్న గోపీచంద్ సీటీమార్ చిత్రంతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమాతో నిజంగానే గోపీచంద్ హిట్ కొడతాడో లేడో చూడాలి.

కాగా ఎఫ్3 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రీసెంట్‌గా వెంకటేష్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించి, సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube