మరోసారి ఆ బ్యూటీతో రొమాన్స్‌కు రెడీ అయిన గోపీచంద్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నా, సరైన హిట్ మాత్రం రావడం లేదు.దీంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ మ్యాచో స్టార్ రెడీ అవుతున్నాడు.

 Gopichand To Romance Raashi Khanna In Maruthi Movie, Gopichand, Maruti, Raashi K-TeluguStop.com

తాజాగా కబడ్డీ ఆట నేపథ్యంలో సీటీమార్ అనే సినిమాను దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు గోపీచంద్.దీంతో ఈ సినిమాపై అటు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు గోపీచంద్ రెడీ అయ్యాడు.

విభిన్న చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో గోపీచంద్ ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాను ఇటీవల చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.అయితే ఈ సినిమాకు సంబంధించి కేవలం దర్శకుడు, హీరో గురించిన వివరాలను మాత్రమే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో అప్పుడే కర్చీఫ్ వేశారు ఈ చిత్ర యూనిట్.అక్టోబర్ 1న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసింది.

కాగా ఈ సినిమాలో గోపీచంద్ పక్కన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమాలో అందాల భామ రాశి ఖన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో గోపీచంద్‌తో జిల్ అనే సినిమాలో నటించిన రాశి ఖన్నా, ఆ సినిమా విజయం కావడంలో తనదైన పాత్ర పోషించింది.ఇప్పుడు మరోసారి రాశిఖన్నా అయితే గోపీచంద్ పక్కన పర్ఫెక్ట్‌గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అటు మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో కూడా రాశి ఖన్నా నటించిన సంగతి తెలిసిందే.దీంతో మరోసారి మారుతి రాశిఖన్నాను తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో నిజంగానే రాశి ఖన్నా హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందా అనే అంశంపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube