డబుల్ రిస్క్ చేస్తున్న గోపీచంద్  

Gopichand To Do Double Shoots From August, Gopichand, Seetimaar, Alivelu Venkataramana, Shooting, Lockdown - Telugu Alivelu Venkataramana, Gopichand, Lockdown, Seetimaar, Shooting

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సీటీమార్ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుని మెజారిటీ శాతం పూర్తి చేసుకుంది.కాగా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

 Gopichand To Do Double Shoots From August

అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్‌లకు అనుమతి లభించడంతో సీటీమార్ చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గోపీచంద్ భావిస్తున్నాడు.

అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా కరోనా కలకలం రేపడంతో హీరోలు షూటింగ్‌ ప్రారంభించాలంటేనే భయపడుతున్నారు.కరోనా వైరస్ సోకుతుందేమో అన్న భయంతో వారు సినిమా షూటింగ్‌లను ఇప్పట్లో మొదలుపెట్టే ఆలోచనలో లేరు.

డబుల్ రిస్క్ చేస్తున్న గోపీచంద్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఏకంగా 2021లోనే తమ సినిమా షూటింగ్‌లను తిరిగి ప్రారంభించాలని చాలా మంది నిర్ణయం తీసుకున్నారు.కానీ గోపీచంద్ మాత్రం ఆగస్టులో తన సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని చూస్తున్నాడు.

అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఏకంగా రెండు సినిమాల షూటింగ్‌ను ఆగస్టులో ప్రారంభించాలని గోపీచంద్ భావిస్తున్నాడు.

సీటీమార్ చిత్రంతో పాటు దర్శకుడు తేజ డైరెక్షన్‌లో రానున్న అలివేలు వెంకటరమణ చిత్రాన్ని కూడా ఆగస్టులో ప్రారంభించాలని చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

మరి గోపీచంద్ ఇంత రిస్క్ చేసి రెండు సినిమాల షూటింగ్‌ను ప్రారంభించడం ఎంతవరకు మంచిదో తెలియాలంటే సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే.ఏదేమైనా గోపీచంద్ గట్స్‌కు పలువురు హ్యాట్సాఫ్ అంటున్నారు.

ఇక కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తమ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ అంటోంది.

#Shooting #Gopichand #Lockdown #Seetimaar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gopichand To Do Double Shoots From August Related Telugu News,Photos/Pics,Images..