సీరియస్ మోడ్‌లోనే లవ్వాట ఆడుతోన్న జోడీ

టాలీవుడ్‌లో రచ్చ సినిమాతో రచ్చ చేసిన దర్శకుడు సంపత్ నంది, వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలతో ఫేడవుట్ అవుతూ వస్తున్నాడు.ఇప్పుడు తన కొత్త సినిమా సీటీమార్‌తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్న ఈ యంగ్ డైరెక్టర్, ఈసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నాడు.

 Love Track Between Gopichand Tamannaah In Seetimaar, Gopichand, Tamannaah, Seeti-TeluguStop.com

ఈ సినిమాలో హీరోగా గోపీచంద్ నటిస్తుండగా, అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈ సినిమాలో వారు కబడ్డీ కోచ్‌లుగా నటిస్తున్నారు.

అయితే చాలా సీరియస్ మోడ్‌లో నడిచే ఈ కథలో సంపత్ నంది కమర్షియల్ అంశాలను ఎక్కడా వదలకుండా వాడుతున్నాడట.ఇద్దరు కోచ్‌ల మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్‌ను మనకు చూపించే విధానం సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక కబడ్డీ కోచ్‌లుగా గోపీచంద్, తమన్నా తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి ఈ సినిమాపై సంపత్ నంది పెట్టుకున్న నమ్మకాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో మనకు అర్ధమవుతోంది.

ఇక ఈ సినిమాలోని తమన్నా, గోపీచంద్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఇప్పటికే రిలీజ్ చేయగా వాటికి మంచి ఆదరణ లభించింది.కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌తో రాబోయే ఈ సినిమాలో మిగతా నటీనటులు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube