మాన్లీ స్టార్ గోపిచంద్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆక్సీజన్.జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏ.
ఎం.రత్నం నిర్మిస్తున్నారు.హిట్ కోసం తపించిపోతున్న గోపిచంద్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో ఎలాంటి డూప్ లేకుండా కష్టపడుతున్నాడట.డూప్ సహాయం తీసుకునే రిస్కీ షాట్స్ కూడా గోపిచంద్ కావాలని చేస్తున్నాడట.
ఫ్యాన్స్ కు రియల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేసిన గోపిచంద్ ఎఫర్ట్ మెచ్చుకునేలా ఉన్నా షూట్ టైంలో ఏదైనా జరిగితే కష్టమే కదా అని వద్దంటున్నా వినట్లేదట.
సౌఖ్యం అంటూ లాస్ట్ ఇయర్ డిశెంబర్లో వచ్చి నిరాశ పరచిన గోపిచంద్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ఇక ఇదే కాకుండా సంపత్ నందితో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న గోపిచంద్.దాని తర్వాత శ్రీ వాస్ డైరక్షన్ లో కూడా మరో సినిమా డిస్కషన్ చేస్తున్నారు.
గోపిచంద్ ను స్టార్ గా నిలబెట్టే ప్రయత్నంగా ఆక్సీజన్ చేస్తున్న దర్శకుడు జ్యోతికృష్ణ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడట.మరి గోపిచంద్ కోరుకున్న హిట్ మజా ఈ సినిమా ఇస్తుందో లేదో చూడాలి.