సీటీమార్ జ్వాలారెడ్డి సాంగ్ 10 మిలియన్ వ్యూస్ క్రాస్..!

మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సినిమా సీటీమార్.కబడ్డీ  నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

 Gopichand Siteemaar Jwalareddy Song 10 Millions Views Record In Youtube-TeluguStop.com

సినిమాలో గోపీచంద్ కు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలోని జ్వాలారెడ్డి సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతుంది.

మార్చ్ 12న రిలీజైన ఈ సాంగ్ రీసెంట్ గా 10 మిలియన్ వ్యూస్ రాబట్టింది.తెలంగాణా ఫోక్ సాంగ్ గా వచ్చిన జ్వాలారెడ్డి పాటను కాసర్ల శ్యాం రచించారు.

 Gopichand Siteemaar Jwalareddy Song 10 Millions Views Record In Youtube-సీటీమార్ జ్వాలారెడ్డి సాంగ్ 10 మిలియన్ వ్యూస్ క్రాస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ పాటని శంకర్ బాబు, మంగ్లీ ఆలపించారు.సీటీమార్ సినిమాలోని జ్వాలారెడ్డి సాంగ్ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేసింది.కెరియర్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు సీటీమార్ పక్కా హిట్ అందించేలా ఉందని చెప్పొచ్చు.ఈ సినిమాతో పాటుగా గోపీచంద్ మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.

తేజ డైరక్షన్ లో అలివేలు మంగ వెంకటరమణ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.ఈ మూడు సినిమాలతో గోపీచంద్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.

 సీటీమార్ సినిమా మీద మాత్రం గోపీచంద్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.ఏప్రిల్ 2న రిలీజ్ అవాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డది.

#Record #JwalaReddy #Youtube #JwalareddySong #Siteemaar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు