హిట్ టాక్ వచ్చిన 'సీటీమార్‌' కు కష్టాలే ఎదురు

గోపీచంద్‌ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన సీటీమార్ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా కాలం అయినా కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

 Gopichand Seetimaar Movie Collections-TeluguStop.com

ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రికార్డు స్థాయిలో (సెకండ్ లాక్ డౌన్ తర్వాత) ఓపెనింగ్స్ ను దక్కించుకుంది.

మొదటి రోజులోనే ఈ సినిమా ఏకంగా నాలుగు కోట్ల వరకు రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.వినాయక చవితి పండుగ ఆ తర్వాత వీకెండ్‌ కారణంగా సినిమాకు మంచి ఆధరణ లభించింది.

 Gopichand Seetimaar Movie Collections-హిట్ టాక్ వచ్చిన సీటీమార్‌’ కు కష్టాలే ఎదురు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శని ఆది వారాల్లో కూడా సినిమా బాగానే రాబట్టిందని సమాచారం అందుతోంది.మొత్తానికి ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో దాదాపుగా 8.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది.సినిమా వసూళ్లు చాలా పాజిటివ్‌ గా ఉన్నా కూడా బ్రేక్ ఈవెన్ కు మాత్రం ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది.

ట్రేడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 13 కోట్ల రూపాయలను వసూళ్లు చేయాల్సి ఉంది.ఇప్పటి వరకు సినిమా 9.5 కోట్ల వసూళ్లు సాధించింది.అంటే ఇంకా దాదాపుగా నాలుగు కోట్ల ను వసూళ్లు చేయాల్సి ఉంది.

ఒక వేళ నాలుగు కోట్లు వసూళ్లు సాధ్యమే అయితే రికార్డుగా చెప్పుకోవచ్చు.ఈ వారంలో పెద్ద సినిమా లు ఏమీ లేకపోవడం వల్ల వచ్చే వీకెండ్‌ లో కూడా ఈ సినిమా నే దుమ్ము రేపే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Telugu Film News, Gopichand, Movie Collections, Sampath Nandi, Seetimar, Tamanna, Tollywood-Movie

ఒక వేళ వచ్చే వీకెండ్ కూడా ఈ సినిమా ఆడితే మాత్రం ఖచ్చితంగా సినిమా కు బ్రేక్‌ ఈవెన్‌ ఖాయం.అయితే కరోనా నేపథ్యంలో ఒక సినిమా ఒక వారం మాత్రమే అన్నట్లుగా ఉంది.సీటీమార్ ఆ సెంటిమెంట్‌ ను చెరిపేస్తుందా అనేది చూడాలి.మొత్తానికి సీటీమార్ చాలా బాగుంది అంటూ టాక్ వచ్చినా కూడా వస్తున్న ఫలితాలు వసూళ్లు చూస్తుంటే కాస్త నిరాశగానే ఉంది.

#Seetimar #Gopichand #Collections #Tamanna #Sampath Nandi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు