గోపీచంద్ సీటీమార్ కొట్టేది అప్పుడేనా?

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ మధ్యకాలంలో సరైన హిట్ కొట్టలేక సతమతమవుతున్నాడు.ఆయన చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ లేదా డిజాస్టర్‌గా మిగలడంతో ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని గోపీచంద్ ఫిక్స్ అయ్యాడు.

 Gopichand Seetimaar Gets Another Release Date, Gopichand, Seetimaar, Tamanaah, S-TeluguStop.com

ఈ క్రమంలోనే దర్శకుడు సంపత్ నందితో కలిసి సీటీమార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.

ఈ సినిమాతో ఎలాగైనా కమ్‌బ్యాక్ ఇవ్వాలని అటు దర్శకుడు సంపత్ నంది కూడా భావిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ తమన్నా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, జ్వాలా రెడ్డి, పెప్సీ ఆంటీ అనే పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.అయితే ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా కారణంగా, సినిమా ఆర్థిక సమస్యల కారణంగా అది కుదరలేదు.

దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు షికారు చేశాయి.కానీ ఈ సినిమాను ఏదేమైనా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

దీంతో సీటీమార్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తే బావుంటుందని చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అప్పటివరకు పరిస్థితులు చక్కడి థియేటర్లకు ప్రజలు రావడం మొదలవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.మరి ఈసారైనా గోపీచంద్ సీటీమార్ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేక మరేదైనా కారణంతో మరోసారి వాయిదా పడుతుందా అనేది చూడాలి.

సీటీమార్ చిత్రంతో గోపీచంద్ హిట్ కొడతాడా లేడా అనేది సినిమా రిలీజ్ తరువాత మాత్రమే తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube