గోపీచంద్ పక్కా కమర్షియల్ లో సెకండ్ హీరోయిన్ ఎవరంటే..!

మాస్ హీరో గోపీచంద్ ఈమధ్యనే సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు గోపీచంద్.

 Gopichand Pakka Commercial Second Heroine Details-TeluguStop.com

ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.సినిమాలో ఒక హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుండగా ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ను కూడా తీసుకుంటున్నట్టు టాక్.

పక్కా కమర్షియల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చిత్ర శుక్ల నటిస్తున్నట్టు తెలుస్తుంది.సినిమాలో ఆమెది కూడా ఇంపార్టెంట్ రోల్ అని ఫిల్మ్ నగర్ టాక్.

 Gopichand Pakka Commercial Second Heroine Details-గోపీచంద్ పక్కా కమర్షియల్ లో సెకండ్ హీరోయిన్ ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జాలీ ఎల్.ఎల్.బి 2 రీమేక్ గా వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు.సినిమాలో మారుతి మార్క్ ఎంటర్టైనింగ్ పక్కా అనేస్తున్నారు.

ఈ సినిమాతో పాటుగా మారుతి మంచి రోజులు వచ్చాయి సినిమా చేశాడు. సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది.

పక్కా కమర్షియల్, మంచి రోజులు వచ్చాయి ఈ రెండు సినిమాలతో మారుతి మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా చాటాలని చూస్తున్నాడు.  ఈ రెండు సినిమాలు చాలా తక్కువ గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

#Rashi Khanna #Gopichand #Maruthi #Chitra Shukla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు