బాలయ్య కోసం పవర్ ఫుల్ టైటిల్ సిద్ధం.. ఈసారి మాములుగా ఉండదు!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో అఖండఅనే సినిమాలో నటిస్తున్నారు.

 Gopichand Malineni Registered Rowdyism Title For Nandamuri Balakrishna Gopichand-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూవస్తోంది.అయితే ప్రస్తుతం షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.

ఇప్పటికే బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి లెజెండ్ సింహ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.

ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న టువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

అయితే ఈసినిమా తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారని ఇప్పటికే అధికార ప్రకటన కూడా చేశారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య బాబు వచ్చేనెలలో గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లో ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Akhanda, Balakrishna, Boyapati, Legend, Rowdyism, Simha, Tollywood-Movie

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు సమాచారం.ఇందులో ఒక పాత్రలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా, మరొక పాత్రలో ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించడంతో ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకురౌడీయిజంఅనే టైటిల్ ఫిక్స్ చేశారని ఫిలిం ఇండస్ట్రీ సమాచారం.అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించడంతో ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది.దర్శకుడు గోపీచంద్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం శృతి హాసన్ ను సంప్రదించగా ఆమె ఈ సినిమాలో నటించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా త్రిష పేరు వినబడుతుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు అనే విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube