క్రాక్ దెబ్బకు గోపీచంద్‌కు టెండర్ పెట్టిన టాప్ బ్యానర్  

Gopichand Malineni Next Movie With Mythri Movie Makers, Gopichand Malineni, Raviteja, Krack, Mythri Movie Makers, Tollywood News - Telugu Gopichand Malineni, Krack, Mythri Movie Makers, Raviteja, Tollywood News

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.చాలా రోజుల తరువాత రవితేజ ఇలాంటి హిట్ అందుకోవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.

TeluguStop.com - Gopichand Malineni Next Movie With Mythri Movie Makers

ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది.గతంలో రవితేజతో కలిసి డాన్ శ్రీను, బలుపు వంటి చిత్రాలు తెరకెక్కించిన గోపీచంద్, ముచ్చటగా మూడోసారి క్రాక్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు.

పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా క్రాక్‌ను తెరకెక్కించడంలో గోపీచంద్ తనదైన ప్రతిభ చూపించడంతో ఈ ఇప్పుడు ఈ డైరెక్టర్‌పై అందరి చూపు పడింది.రొటీన్ కథను కూడా ఇంత ఎంగేజింగ్‌గా మాస్ ఆడియెన్స్ మెచ్చే విధంగా తెరకెక్కించవచ్చని గోపీచంద్ మలినేని ప్రూవ్ చేయడంతో ఇప్పుడు ఆయనతో సినిమా చేసేందుకు పలు టాప్ ప్రొడ్యూసింగ్ బ్యానర్‌లు ఆసక్తిని చూపుతున్నాయి.

TeluguStop.com - క్రాక్ దెబ్బకు గోపీచంద్‌కు టెండర్ పెట్టిన టాప్ బ్యానర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే గోపీచంద్ మలినేని వేరే ఏ సినిమా కమిట్ కాకముందే తమ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
తమ బ్యానర్‌లో రాబోయే నెక్ట్స్ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెలిపింది.

ఇక త్వరలోనే గోపీచంద్ డైరెక్షన్‌లో ఓ సినిమా రానుందని, ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సదరు బ్యానర్ వెల్లడించింది.మరి క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

అటు రవితేజ ఇప్పటికే తన నెక్ట్స్ మూవీ ‘ఖిలాడి’ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు.

#Krack #MythriMovie #Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు