బాలయ్యతో సినిమా చేయబోతున్న క్రాక్ డైరెక్టర్..

నటసింహం నందమూరి బాలకృష్ణ వరస సినిమాలను అంగీకరిస్తూ బిజీగా మారబోతున్నాడు.ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

 Gopichand Malineni Meets Balakrishna For Upcoming Film-TeluguStop.com

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి.దీని తర్వాత రావిపూడితో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే బాలయ్య క్రాక్ సినిమాతో మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.తాజాగా బాలకృష్ణతో గోపీచంద్ మలినేని భేటీ అయ్యారు.ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది.

 Gopichand Malineni Meets Balakrishna For Upcoming Film-బాలయ్యతో సినిమా చేయబోతున్న క్రాక్ డైరెక్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గోపీచంద్ మలినేని ఇప్పటికే ఒక కథను కూడా రెడీ చేసాడని అందుకే బాలకృష్ణను కలిసి ఆ కథను కూడా వినిపించాడని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే గోపీచంద్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారట.

మొన్నటి వరకు రూమర్ అని అంతా అనుకున్నారు.కానీ గోపీచంద్ మలినేని బాలకృష్ణతో ఫోటో దిగి సోషల్ మీడియాతో పెట్టడంతో సినిమా కన్ఫర్మ్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో నుండి వినిపిస్తున్న టాక్.ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

తాజాగా తీసిన క్రాక్ చిత్రంలో రవితేజ ను కూడా పోలీస్ పాత్రలో చూపించి మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

#Social Media #Boyapati #PreProduction #PoliceOfficer #Krack

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు