కబడ్డీ కోచ్ గా మారిన గోపీచంద్... కొత్త సినిమా కోసం కొత్త అవతారం  

Gopichand Is Kabaddi Coach In Sampath Nandi\'s Film-sampath Nandi\\'s Film,tamannah,tollywood

యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్.కెరీర్ లో మొదటి సినిమా ప్లాప్ అయినా కూడా తర్వాత విలన్ గా టర్న్ తీసుకుని వర్షం, నిజం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ మెప్పించిన మరల హీరోగా టర్న్ తీసుకున్నాడు.

Gopichand Is Kabaddi Coach In Sampath Nandi\'s Film-sampath Nandi\\'s Film,tamannah,tollywood Telugu Tollywood Movie Cinema Film Latest News-Gopichand Is Kabaddi Coach In Sampath Nandi's Film-Sampath Nandi\\'s Film Tamannah Tollywood

ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా యాక్షన్ హీరోగా నిలదొక్కుకున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో గోపీచంద్ కెరియర్ చాలా సందిగ్ధావస్థలో ఉందని చెప్పాలి.

తను హీరోగా నటిస్తున్న ప్రతి సినిమా యావరేజ్ లేదంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్నాయి.కథలు బాగున్న కూడా కథనంలో కొత్తదనం లేకపోవడం వల్ల సినిమాలు థియేటర్స్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే వరుసగా ఫ్లాపులు వస్తున్న కూడా గోపీచంద్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.గోపీచంద్ కి గౌతమ్ నంద సినిమాతో యావరేజ్ ఇచ్చిన సంపత్ నంది దర్శకత్వంలో తాజాగా కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.

అయితే ఈసారి గోపీచంద్ కెరీర్ లో చేయనటువంటి డిఫరెంట్ రోల్ ని పోషించబోతున్నాడు.ఇందులో ఆంధ్ర విమెన్స్ కబడ్డీ టీం కోచ్ గా గోపీచంద్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక గోపీచంద్ కి హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా తెలంగాణ విమెన్స్ కబడ్డీ టీం కోచ్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.మరి గోపీచంద్ కెరీర్ లో మొదటి సారి డిఫరెంట్ పాత్రలో చేస్తున్న ఈ సినిమా అతనికి ఎంత వరకు తిరిగి సక్సెస్ ఇచ్చి మునుపటి ఫామ్ ని అందిస్తుంది అనేది వేచి చూడాలి.

.

తాజా వార్తలు