మళ్లీ సాహసం చేయను

హీరోగా ఎంట్రీ ఇచ్చి, సక్సెస్‌లు దక్కక పోవడంతో విలన్‌గా నటించాడు.విలన్‌గా హీరోకు వచ్చే గుర్తింపును తెచ్చుకున్నాడు.

 Gopichand Don’t Want To Do Experimental Films-TeluguStop.com

ఆ క్రమంలోనే హీరోగా ఒక సినిమాలో నటించాడు.అలా హీరోగా సెటిల్‌ అయ్యాడు గోపీచంద్‌.

ఈయన కెరీర్‌ ఆరంభం నుండి వడిదుడుకులు ఎదర్కొంటూనే ఉన్నాడు.అయినా కూడా సాఫీగా ఈయన తన పనేంటో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.

తాజాగా ఈయన ‘సౌఖ్యం’ చిత్రంలో నటించాడు.‘లౌఖ్యం’ తర్వాత రాబోతున్న ఈ ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెబుతున్నాడు.

ఈ సందర్బంగా ఈయన మీడియాతో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

హీరోగా మాత్రమే కాకుండా విలన్‌గా కూడా మంచి పాత్రలు వస్తే చేసేందుకు సిద్దంగా ఉన్నాను అని చెప్పిన గోపీచంద్‌, గతంలో చేసిన ‘సాహసం’ వంటి ప్రయోగాత్మక చిత్రాలను చేయాని తాను భావించడం లేదు అని, అలాంటి సినిమాలు ఇప్పట్లో చేసే ఆలోచన లేదు అని చెప్పుకొచ్చాడు.

ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఇది సరైన సమయం అని తాను భావించడం లేదు అని గోపీచంద్‌ అన్నాడు.తాజాగా ఈయన హీరోగా ‘ఆక్సీజన్‌’ చిత్రం ప్రారంభం అయ్యింది.

జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమా పక్కా కమర్షియల్‌ చిత్రంగా ఉండబోతుంది.రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించనుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube