ఆగష్టులో మొదలుకాబోతున్న గోపిచంద్ కబడ్డీ ఆట

యాక్షన్ హీరో గోపిచంద్ చాలా కాలంగా ఫ్లాప్ సినిమాలతో సహవాసం చేస్తున్నాడు.అతని సినిమాలలో కంటెంట్ ఉన్న ప్రెజెంటేషన్ లో ఫెయిల్ కావడంతో థియేటర్స్ లో డిజాస్టర్ అవుతున్నాయి.

 Gopichand City Maar Movie Shooting Will Start In August, Tollywood, Telugu Cinem-TeluguStop.com

వరుస ఫ్లాప్ ల కారణంగా అతని మార్కెట్ కూడా పడిపోయింది.అయిన కూడా అతను ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు.

ప్రస్తుతం గౌతమ్ నందా తర్వాత మరోసారి సంపత్ నంది దర్శకత్వంలో సిటీమార్ అనే సినిమా చేస్తున్నాడు.కబడ్డీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్ కి జోడీగా తమన్నా నటిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిఅమ షూటింగ్ ప్రారంభం అయ్యింది.భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

తమన్నా తెలంగాణ కబడ్డీ టీంకు కోచ్ గా కనిపించనుండగా ఆంధ్రా కబడ్డీ టీం కోచ్ గా గోపిచంద్ నటిస్తున్నాడు.

గోపిచంద్ తన పుట్టిన రోజు సందర్భంగా సీటీమార్ టీం ఓ అదిరిపోయే సప్రైజ్ ను ప్లాన్ చేసింది.

ఈ సినిమానుంచి ఫస్ట్ టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటివరకు 60 శాతం షూటింగ్ జరుపుకోగా తదుపరి షెడ్యూల్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుంది.ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

అక్టోబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ సినిమా మీద గోపిచంద్ భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

మరి అతని అంచనాలని అందుకోవాలంటే ముందుగా టీజర్ తో కొంత వరకు సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వాలి.అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube