హిట్టు కోసం చాణక్య కష్టాలు!  

Gopichand Chankya Movie Latest Update-

టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా యాక్షన్ హీరో గోపీచంద్ కి ఉండే క్రేజే వేరు.స్టార్ హీరోల సరసన నిలిచే మాస్ లుక్స్ ఉన్నప్పటికీ సరైన కథలు తగలక ఇంకా ఒక స్టేజ్ లోనే స్ట్రగుల్ అవుతున్నాడు.గోపి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఒక మంచి యాక్షన్ మూవీ తగిలితే అతను కూడా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోగలడని చెప్పవచ్చు...

Gopichand Chankya Movie Latest Update--Gopichand Chankya Movie Latest Update-

అయితే అతనికి గత కొన్నేళ్లుగా వరుస అపజయాలు కోలుకోనివ్వకుండా చేస్తున్నాయి.25వ సినిమా అయిన పంతం కూడా దెబ్బేసింది.దీంతో నెక్స్ట్ సినిమా ద్వారా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు.ప్రస్తుతం చాణక్య అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్ గా కొన్ని సన్నివేశాలు అనుకున్నంతగా రాలేవని రీ షూట్ చేసినట్లు తెలుస్తోంది.

Gopichand Chankya Movie Latest Update--Gopichand Chankya Movie Latest Update-

దాదాపు యాక్షన్ సీన్స్ అన్నిటిలో గోపీచంద్ డూప్ లేకుండా నటించనట్లు టాక్.తిరు డైరెక్షన్ లో తెరక్కుతున్న ఆ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.గోపి సరసన మెహ్రీన్ పిర్జాదా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.