అనుమానాలను పటాపంచలు చేసేసిన గోపీచంద్, తమన్నా

గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్‌ గా రూపొందుతున్న సిటీమార్ సినిమా విడుదల విషయమై నెలకొన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా విడుదలను ఏప్రిల్‌ 2 అంటూ ప్రకటించారు.

 Gopichand And Tamanna Movie Seetimaar Movie Release Date, Gopichand, Sampath Nan-TeluguStop.com

అదే తేదీన నాగార్జున వైల్డ్‌ డాగ్ వస్తున్న కారణంగా వాయిదా వేసే విషయమై ఆలోచనల్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల వాయిదా వేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

సినిమా కు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇంకా మొదలు పెట్టని కారణంగా సినిమా విడుదల వాయిదా వేశారేమో అంటూ ప్రచారం జరుగుతున్న కారణంగా తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ఒక పోస్టర్ ను విడుదల చేసి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా బల్ల గుద్ది మరీ చెప్పారు.

సినిమా ను ముందు నుండి అనుకుంటున్నట్లుగానే ఏప్రిల్‌ 2న విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.

ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు పోస్టర్‌ ను విడుదల చేశారు.హ్యాపీ వరల్డ్‌ కబడ్డీ డే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు కబడ్డీ ప్లేయర్‌ లు అందరికి కూడా శుభాకాంక్ష లు చెప్పారు.

ఈ సినిమా కు సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.గోపీచంద్‌ మరియు తమన్నాలు ఈ సినిమాలో ఆంధ్రా మరియు తెలంగాణ కబడ్డీ జట్ల కు కోచ్ లు గా కనిపించబోతున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు మరియు ప్రేక్షకులు హమ్మయ్య అంటున్నారు.వైల్డ్‌ డాగ్‌ కు పోటీగా ఈ సినిమా విడుదల అయితే ఎంత మేరకు పోటీని ఇవ్వగలదు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమా లోని కబడ్డీ పోటీలకు సంబంధించిన సీన్స్ సినిమాలోనే హైలైట్‌ గా నిలుస్తాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.గత కొంత కాలంగా సక్సెస్ లు లేకుండా ఉన్న గోపీచంద్‌ కు ఈ సినిమా అయినా సక్సెస్ ను ఇచ్చేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube