హిట్టు పడ్డది రేటు పెంచేశాడు..!

సినిమా హిట్టు పడ్డది అంటే తారలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.అయితే ఒక సినిమా హిట్ అయితే అందులో ముఖ్య పాత్ర వహించిన క్రూకి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

 Gopi Sundar Hike His Remuneration , Akhil, Akhil Akkineni, Gopi Sundar, Gopi Sun-TeluguStop.com

ఈ క్రమంలో మళయాళ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ గోపీ సుందర్ అఖిల్ బ్యాచిలర్ సినిమాతో హిట్టు కొట్టాడో లేదో అలా రేటు పెంచేసినట్టు తెలుస్తుంది. అఖిల్, పూజా హెగ్దే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఆల్బం మొత్తం మెలోడీస్ తో నింపేసిన గోపీ సుందర్ బిజిఎం కూడా బాగానే ఇచ్చాడు.

ఇక హిట్టు పడటంతోనే తన రెమ్యునరేషన్ పెంచేశాడు గోపీ సుందర్.

ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ ని డబుల్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.టాలీవుడ్ లో దేవి శ్రీ ప్రసాద్, థమన్ తర్వాత యువ హీరోల సినిమాలకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

స్టార్ సినిమా ఛాన్సుల కోసం చూస్తున్న గోపీ సుందర్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని బాగా వాడుకుంటున్నాడని చెప్పొచ్చు.తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న గోపీ సుందర్ ఇక్కడ మరెన్నో సినిమాలు చేయాలని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube