పాన్ ఇండియన్ హీరోగా మారిన ప్రభాస్.ప్రస్తుతం వరుసబెట్టి భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు.
సలార్, రాధేశ్యామ్ సహా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.బాహుబలితో ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆయన.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేవరెట్ యాక్టర్ గా మారిపోయాడు.అటు నాలుగు పదుల వయసున్నా.
ఇంకా తను పెళ్లి మాట ఎత్తట్లేడు.ఆయన అభిమానులు నిత్యం ఆయనను పెళ్లి గురించే అడుగుతారు.
అయినా తను ఇప్పటి వరకు దాని గురించి కామెంట్ చేయలేదు.బాహుబలి తర్వాత తను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ.ఆయన పలు ప్రాజెక్టుల్లో బిజీ కావడంతో ఆ ప్రస్తావన తేవట్లేడు.
తాజాగా ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీ చంద్ మాత్రం.ప్రభాస్ పెళ్లి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.బాహుబలి తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి తనపై వచ్చినట్లు చెప్పాడు.అయితే ఆ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వస్తున్నట్లు చెప్పాడు.
ఈ సినిమాలు పూర్తికాగానే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెప్పాడు.అయితే ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలు.
ఎంత లేదన్నా.ఒక్కో సినిమాకు రెండు సంవత్సరాలు పడుతుంది.
ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు.మరికొన్ని సినిమాలను సైతం పరిశీలిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఆయన పెళ్లి ముచ్చట ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.

మొత్తంగా ఆయన తాజా సినిమాలు పూర్తయ్యే సరికే సుమారు 5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.ఈ లెక్కన ఆయన పెళ్లి మరో 5 సంవత్సరాల పాటు జరగదనే చెప్పుకోవచ్చు.వాస్తవాలు ఎలా ఉన్నా.
ఆయన అభిమానులు మాత్రం ఆయన పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు.సినిమాల విషయంలో ఫ్యాన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తున్న ప్రభాస్.
పెళ్లి న్యూస్ చెప్పి.మరింత సంతోష పెట్టాలని కోరుతున్నారు.
అయితే వారి కోరిక తీరేందుకు మరికొంత కాలం సంమయం పట్టే అవకాశం ఉంది.