ఎఫ్3లో వెంకటేష్ తండ్రిగా క్లాస్ తండ్రి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమా ఎఫ్2.వెంకటేష్, వరుణ్ తేజ్ పండించిన కామెడీ ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది.

 Goparaju Ramana Father Of Venkatesh In F3, Tollywood, Telugu Cinema, F2 Sequel,-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాలో వినోదం మొత్తం ఇద్దరు హీరోల చుట్టూ తిరుగుతుంది.దాంతో పాటు హీరోయిన్స్, వారి ఫ్యామిలీ కూడా ఈ ఫ్యామిలీ ఫన్ లో భాగం అవుతారు.

ఇప్పుడు అనిల్ రావిపూడి ఎఫ్2 సీక్వెల్ గా ఎఫ్3ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.ఈ సినిమాలో మరింత ఫన్ అందించబోతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశాడు.

ఇక పోస్టర్ బట్టి డబ్బు చుట్టూ ఈ సినిమా కథ ఇతివృత్తం ఉంటుందని తెలుస్తుంది.వెంకి, వరుణ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిపోయింది.సెట్స్ పైన ప్రస్తుతం ఉంది.

ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ తండ్రి పాత్రతో కూడా వినోదాన్ని మరింత అందించడానికి అనిల్ సిద్ధమయ్యాడు.

దాని కోసం సీనియర్ నటుడుని రంగంలోకి దించుతున్నాడు.ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయ్యి మిడిల్ క్లాస్ మేలోడీస్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు గోపరాజు రమణని రంగంలోకి దించినట్లు తెలుస్తుంది.

ఇతనితో ఫ్రస్టేషన్ కామెడీని పండించడానికి అనిల్ రావిపూడి సిద్ధమైనట్లు తెలుస్తుంది.ఒక వేళ అదే జరిగితే ఈ సినిమాతో గోపరాజు రమణ కెరియర్ టర్న్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube