ఉసిరి కాయలో మీకు తెలియని ఎన్నో రహస్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా?  

Gooseberry (usirikaya) Health Benefits -

ఉసిరికాయలు పుల్లని రుచితో ఉంటాయి.ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఉసిరిలో యాపిల్ కంటే మూడు రెట్ల ప్రోటీన్స్ ఉన్నాయి.దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా పోషకాలు ఉసిరిలో ఉన్నాయి.

Gooseberry (Usirikaya) Health Benefits-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.

ఉసిరిలో విటమిన్ C అధికంగా ఉంటుంది.

ఉసిరికాయను తినటం వలన మన శరీరానికి అవసరమైన విటమిన్ C అందుతుంది.

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా సహాయపడుతుంది.

మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.

జుట్టు పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది.

చుండ్రు, జుట్టు సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మధుమేహం,గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది.

ఉసిరిలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తహీనత రాకుండా కాపాడుతుంది.

ఉసిరిలో క్రోమియం అధికంగా ఉండుట వలన మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

ఉసిరికాయను తినటం వలన శరీరంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి.

ఉసిరికాయలో లక్షణాలు వ్యాధినిరోధక శక్తిని పెంచటానికి సహాయపడతాయి.

ఉసిరికాయలో ఉండే ప్రోటీన్ మెటబాలిజం రేటును పెంచుతుంది.తద్వారా శరీరంలో అదనపు కొవ్వు కరుగుతుంది.

నోటి అల్సర్ తో బాధపడేవారు కొంచెం ఉసిరిరసాన్ని నీటిలో కలిపి నోటిలో పోసుకొని పుక్కిలిస్తే అల్సర్ సమస్య నుండి బయటపడతారు.

కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు రెండు ఉసిరికాయలను తింటూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

తాజా వార్తలు