గూగుల్‌ క్రోమ్‌ నయా ఫీచర్‌తో... ఇక సేఫ్‌ బ్రౌజింగ్‌!

గూగుల్‌ క్రోమ్‌ చాలా మందికి పరిచయమే! దీనిని వాడే యూజర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.చాలామంది దీన్ని ఉపయోగించడానికి కారణ ం .

 Google Chrome New Feature Can Browse Safe And Securely, Google Chrome, Malware,-TeluguStop.com

ఇది వాడటం చాలా సులభతరం.అందుకే గూగుల్‌ క్రోమ్‌కు అంత పేరు.

అయితే, క్రోమ్‌ నయా ప్రైవసీ పాలసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.మొన్నటి వరకు ఈ యాప్‌ వాడకం సురక్షితం కాదని విన్నాం.

అందుకే చాలా మంది వినియోగదారులు భయపడి ఈ యాప్‌లకు ప్రత్నమ్నాయం కూడా వాడారు.దీన్ని దృష్టిలో పెట్టుకున్న గూగుల్‌ తమ యూజర్ల సేఫ్‌ అండ్‌ సెక్యూర్డ్‌గా బ్రౌజింగ్‌ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు అప్టేడ్‌ చేస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే గూగుల్‌ నయా మార్పులతో సురక్షితంగా బ్రౌజింగ్‌ చేసుకోవచ్చని అంటోంది.అదనంగా ఎక్స్‌టెన్షన్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

దీంతో వెబ్‌సైట్‌కి వెళ్లే పని లేకుండా … ఎక్స్‌టెన్షన్‌ తో పని పూర్తి చేయవచ్చు.మాల్వేర్‌ బారిన పడకుండా వినియోగదారులను రక్షించేందుకు క్రోమ్‌ తాజాగా తీసుకొస్తున్న 91 అప్‌డేట్‌లో మార్పులు చేసింది.

ఏదైనా ఫేక్‌ ఎక్స్‌టెన్షన్‌ డౌన్‌ లోడ్‌ చేస్తుంటే… క్రోమ్‌ వినియోగదారులను అలర్ట్‌ చేస్తుంది.

ఈ కొత్త ఫీచర్‌ను ఇప్పటికే కొంతమంది యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

సాధారణంగా క్రోమ్‌ బ్రౌజర్‌లో సేఫ్‌ బ్రౌజింగ్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది.దాన్ని ఎనేబుల్‌ చేస్తే ఫేక్‌ లేదా ఇతర డేంజర్‌ ఫైళ్లు డౌన్‌లోడ్‌ కాకుండా వినియోగదారును హెచ్చరిస్తుంది.

Telugu Chromeprivacy, Enhanced, Google, Google Chrome, Googlechrome, Malware, Ma

ఈ ఆప్షన్‌కు మించినదే ‘ఎన్‌హ్యాన్స్‌డ్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌ ’.దీన్ని ఎనేబుల్‌ చేస్తే తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్‌ కాకుండా.అడ్డుకట్ట వేసేందుకు వినియోగదారులను అలర్ట్‌ చేస్తుంది.అంతేకాదు.ఈ పేజీతో గతం లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని పరీక్షిస్తుంది.పాస్‌వర్డ్‌ను కూడా ఎక్స్‌పోజ్‌ కాకుండా యూజర్లకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇలా యాక్టివేట్‌ చేసుకోండి


Telugu Chromeprivacy, Enhanced, Google, Google Chrome, Googlechrome, Malware, Ma

మొదట క్రోమ్‌ బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ ఆప్షన్‌లోని ‘సెక్యూరిటీ’ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే సేఫ్‌ బ్రౌజింగ్‌లోని ఎన్‌ బ్రౌజింగ్‌లోని ఎన్‌ హ్యాన్స్‌డ్‌ ప్రొటెక్షన్‌ అని ఉంటుంది.దాన్ని యాక్టివ్‌ చేసుకుంటే సరిపోతుంది.లేదంటే.సెట్టింగ్స్‌లోకి వెళ్లి పైన సెర్చ్‌లో ఎన్‌ హ్యాన్స్‌డ్‌ ప్రొటెక్షన్‌ అని ఉంటుంది.దాన్ని యాక్టివ్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఆ తర్వాత ఎనేబుల్‌ చేసుకుంటే సరిపోతుంది.ఇక మీరు సురక్షితంగా గూగుల్‌ క్రోమ్‌ను బ్రౌజింగ్‌ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube