గూగుల్ సెర్చ్ లో నెంబర్ వన్ గా నిలిచిన ఇండియన్ హీరో అభినందన్

సీఆర్పీఎఫ్ జవాన్ల మీద ఉగ్రదాడి తర్వాత ఎయిర్ ఇండియాలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్ చేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదులని మట్టుబెట్టడంతో పాటు వారి స్థావరాలని ద్వంసం చేసాయి.అదే సమయంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలని తిప్పి కొట్టే క్రమంలో ఆ దేశానికి యుద్ధ ఖైదిగా చిక్కిన ఇండియన్ హీరో ఎయిర్ కమాండర్ అభినందన్ విషయం ఎంత చర్చనీయాంశంగా మారిందో అందరికి తెలిసిందే.

 Google Trend Most Serched Person In Google Is Abhinandan-TeluguStop.com

ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా హీరో అయిపోయిన అతనిని ఆ దేశం తప్పనిసరి పరిస్థితిలో ఇండియాలో అప్పగించింది.ఇక తరువాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్న మరల తన దేశ డ్యూటీలో భాగమై దేశ సేవకి వెళ్ళిపోయాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అభినందన్ విషయం మరోసారి సోషల్ మీడియాలో చర్చమీయాంశంగా మారింది.

గూగుల్‌లో ఈ ఏడాది అత్యధికంగా వెతికిన టాప్-10 ప్రముఖుల జాబితాను గూగుల్ ఇండియా ప్రకటించింది.

ఈ జాబితాలో చాలా మంది ప్రముఖులని వెనక్కి నెట్టి వింగ్ కమాండర్ అభినందన్ మొదటి స్థానంలోకి వచ్చారు.అతని తర్వాత రెండో స్థానంలో లతా మంగేష్కర్ ఉండగా, యువరాజ్ సింగ్ మూడోస్థానానికి పరిమితయ్యాడు.

సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాణు మండల్ టాప్ 10లో ఏడో స్థానంలో నిలవడం విశేషం.ఇలా గూగల్ సెర్చ్ ఇంజన్ లో ఈ ఏడాది ఎక్కువగా వెతికినా జాబితాలో రియల్ హీరో అభినందన్ టాప్ లోకి రావడం ద్వారా సోషల్ మీడియాలో మరోసారి సారి అతని గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube