ఇక పై ఆ కంపెనీలో హైబ్రిడ్ వర్క్ వీక్‌.. అసలు హైబ్రిడ్ వర్క్ అంటే ఏంటంటే..!?

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది దాదాపు ప్రపంచమంతా పూర్తిగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది.దీంతో చిన్నా పెద్ద కంపెనీల ఉద్యోగులందరూ వర్క్‌ ఫ్రం చేస్తున్నారు.

 Google Company To Impart Google Hybrid Work Week To Its Employees Due To Corona-TeluguStop.com

ఇది ఉద్యోగులకు, కార్పొరేట్‌ కంపెనీలకు ఎంతో కలిసి వచ్చింది.ముఖ్యంగా గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్ తదితర కంపెనీలకు పలు రకాలుగా ఖర్చు పెద్ద మొత్తం తగ్గిపోయింది.

గూగుల్‌కు ఒక బిలియన్‌ డాలర్ల మేర ఖర్చు తగ్గినట్లు సమాచారం.కరోనా మహమ్మారి కారణంగా సంస్థలో మార్కెటింగ్, పరిపాలనా ఖర్చులు చాలా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

అయితే ఇతర టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా, గూగుల్ ఈ సంవత్సరం సెప్టెంబరు నెలలో తన కార్యాలయాలను తెరవనున్నామని పేర్కొంది.ఇది ఆయా దేశాల కోవిడ్‌ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

గూగుల్ ‘హైబ్రిడ్’ మోడల్‌లో ఉద్యోగులు తగినంత దూరంలో కూర్చొని సేవలందిస్తారని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ పేర్కన్నారు.

ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్‌లో గూగుల్ పెట్టుబడులు పెట్టడం కొనసాగుతుందని చెప్పారు.

తాజాగా గూగుల్ హైబ్రిడ్ వ‌ర్క్ వీక్‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ఆ కంపెనీ సీఈవో సుంద‌ర్ పిచాయ్ చెప్పారు.ఈ మేర‌కు కంపెనీ ఉద్యోగుల‌కు మెయిల్ పంపించారు.ఇప్ప‌టికే సంస్థ‌లో 20 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే ప‌ని చేయ‌నున్నారు.మ‌రో 60 శాతం మంది ఉద్యోగులను మాత్రం ఈ హైబ్రిడ్ వ‌ర్క్ వీక్‌లోకి మూవ్ చేస్తున్నారు.

దీని ప్ర‌కారం ఈ ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలి.మిగ‌తా రెండు రోజులు ఎక్క‌డి నుంచైనా ప‌ని చేసే అవ‌కాశం ఉంటుంద‌ని పిచాయ్ చెప్పారు.

ఈ ఏడాది చివ‌ర్లో గూగుల్ త‌మ ఆఫీసుల‌ను తెరిచే ప్ర‌య‌త్నం చేస్తోంది.ఆఫీసులు తెరిచిన త‌ర్వాత కూడా 20 శాతం మందికి మాత్రం ఇంటి నుంచే ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube