ఆ దేశంలో గూగుల్ సేవలకు అంతరాయం...!

టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ సంస్థ సంబంధించి సేవలు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.అయితే ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అంతరాయం ఏర్పడినట్లు అర్థమవుతోంది.

 Google Services Suspended For Some Time, Google Users, Google Company, Google Se-TeluguStop.com

అమెరికా దేశపు కాలమాన ప్రకారం గురువారం నాడు సాయంత్రం 6 గంటల నుండి 6 : 20 నిమిషాల మధ్య గూగుల్ సేవలకు పూర్తి అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.ఇందుకు సంబంధించి అమెరికాలోని చాలా వెబ్ సైట్స్ ఈ విషయాలను ధృవీకరించాయి కూడా.

దాదాపు 20 నిమిషాల పాటు గూగుల్ సేవలు నిలిచిపోవడంతో అనేకమంది ఇబ్బందుల పాలయ్యారు.
గూగుల్ సేవలకు సంబంధించి మ్యాప్స్, జిమెయిల్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ లాంటి సర్వీస్ లో అన్ని కూడా ఓపెన్ అవ్వలేదు.

ఈ సంఘటనతో సోషల్ మీడియాలో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదుల వెల్లువ చేశారు.అయితే ఈ విషయం గూగుల్ తెలుసుకొని సమస్యను పరిష్కరించడానికి 20 నిమిషాలు పట్టింది.

ఆ తర్వాత జరిగిన అంతరాయానికి గూగుల్ సంస్థ క్షమాపణలు తెలియజేసింది.అయితే ఈ సమస్య కేవలం అమెరికా లోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోనే అనేకమంది యూజర్లకు గూగుల్ సేవలు అందట్లేదన్న ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.
ఈ సమస్య కేవలం మామూలు గూగుల్ యూజర్లకు మాత్రమే కాకుండా, గూగుల్ సంస్థకు చెందిన క్లౌడ్ సేవలను ఉపయోగించే కార్పొరేట్ కస్టమర్లకు కూడా అనేక ఇబ్బందులు కలిగినట్లు సమాచారం.అయితే కేవలం అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోనే ఈ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం.

ఆ సమయంలో మిగతా ప్రపంచం మొత్తం గూగుల్ సేవలు యధావిధిగా అందుబాటులో ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది.అయితే కేవలం ఆ ప్రాంతానికి సంబంధించి మాత్రమే గూగుల్ సేవలు ఎలా అంతరాయానికి గురయ్యాయని శోధించగా… గూగుల్ అందుకు ఆ ప్రాంతానికి చెందిన పలు సర్వర్స్ క్రాష్ అవ్వడం ద్వారానే ఈ సమస్య వచ్చినట్లు పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube