గూగుల్ క్యా హువా..? ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వీసులు డౌన్..!

ప్రపంచంలో అత్యధిక మంది సెర్చ్ ఇంజన్ గా ఉపయోగించే వాటిలో గూగుల్ సెర్చ్ ఇంజన్ మొదటి స్థానంలో నిలబడుతుంది.సోమవారం సాయంత్రం వేళ ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ సంస్థకి చెందిన యూట్యూబ్, గూగుల్ డాకుమెంట్స్, జిమెయిల్ లాంటి అన్ని సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.

 Google And Youtube Servers Down , Global Outage, Gmail Error, Something Went Wro-TeluguStop.com

గూగుల్ వెబ్ పేజీలు ఓపెన్ చేస్తుంటే అందులో ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టులు వెల్లువెత్తాయి.గూగుల్ సంస్థ నివేదిక ప్రకారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ సమస్య ప్రజలు ఎదుర్కొన్నట్లు తెలిపింది.

ఇందుమూలంగా గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేస్తే.వారికి ” ఎర్రర్ 500 “ అని చూపిస్తుంది అంటూ ఎంతో మంది నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇందులో చాలా మందికి ఎర్రర్ కారణంగా ” మీరు దయచేసి తిరిగి ప్రయత్నించండి” అంటూ స్క్రీన్ పై కనిపిస్తున్నట్లు నివేదించారు.

ఇక వీడియో ఫ్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ హోమ్ పేజీలో కూడా “సంథింగ్ వెంట్ రాంగ్” అంటూ ఎర్రర్ మెసేజ్ చూపించిందని, జిమెయిల్ లో అయితే ‘ఊప్స్… సిస్టమ్ ఎంకౌంటరేడ్ ప్రబ్లెమ్(# 2014)’ అంటూ చూపించిందని సోషల్ మీడియాలో నెటిజెన్స్ పెద్ద ఎత్తున ప్రస్తావించారు.వీటితో పాటు గూగుల్ సంస్థకు చెందిన గూగుల్ డ్రైవ్ అలాగే గూగుల్ షీట్స్ సంబంధించి కూడా పని జరగలేదని తెలియజేశారు.ఈ ఆంతర్యాన్ని గల కారణాన్ని మాత్రం గూగుల్ ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.

అయితే, ఈ సమస్యపై గూగుల్ సంస్థ కాస్త లేటుగా స్పందిస్తూ.తమ సిబ్బంది ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని పరిశీలిస్తున్నాము.

దీనిపై అతి త్వరలో అప్డేట్ ఇస్తాము అన్నట్లు తెలిపింది.దాదాపు

రెండు గంటలు

అయిన తర్వాత గూగుల్ సంస్థకు చెందిన అన్ని సర్వీసులు తిరిగి మొదలయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube