గూగుల్ సెర్చ్ ప్రస్తుతం ఈ యాప్ లేకుంటే మనుషులు బ్రతకలేని స్దాయిలో ఉన్నారు.ఎందుకంటే తన మీద, ఇతరుల మీద ఆధారపడటం కంటే ప్రజలు ఎక్కువగా గూగుల్ సెర్చ్ పైనే ఆధారపడుతున్నారు.
కానీ ఈ గూగుల్ సెర్చ్ అంత సేఫ్ కాదంటున్నారు నిపుణులు.ఎందుకంటే అమాయకంగా ఈ గూగుల్ సెర్చ్ ను నమ్ముకుని కోట్లు పోగొట్టుకుంటున్నారట.ముఖ్యంగా వివిధ సంస్థల కస్టమర్ కేర్‌కు సంబంధించిన ఫోన్ నంబర్ల కోసం గాలించి బాధితులు అడ్డంగా బుక్ అవుతున్నారు.గూగుల్ సెర్చ్‌కు పోయి మరీ సైబర్ మోసగాళ్లకు చిక్కిపోతున్నారట.
ఇకపోతే కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ల కోసం గాలించి దాదాపు 134 మంది గత సంవత్సరం సుమారుగా రూ.1.55కోట్లు తమ ఖాతాల నుంచి పోగొట్టుకున్నారట.ఈ నేపథ్యంలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గూగుల్, యాహూ, బింగ్ దాంట్లో సెర్చ్‌చేసి మోసపోవద్దని ప్రజలను కోరుతున్నారు.
ఇక ఈ అంశం పై సోషల్ మీడియాలో బుధవారం నుంచి విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.