ఇక గూగుల్ లో ఈ సేవలు బంద్..!

ఒకప్పుడు ఏదైనా డౌట్ వస్తే ఆ బుక్కు.ఈ బుక్కు తిరగేసి సమాధానం తెల్సుకోవాల్సి వచ్చేది.

 Google ,search Engine, Social Media, Viral Latest, Services, Bund,latest News-TeluguStop.com

కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరికి ఏ డౌట్ వచ్చినా ముందుగా అడిగేది మన ఫోన్ లో ఉన్న గూగుల్ నే.డౌట్ రాగానే ఫోన్ తీశామా.టైపు చేసి గూగుల్ ని అడిగామా.మనకి కావాల్సిన సమాధానం తెలుసుకున్నామా.అయిపోయిందా.మన లైఫ్ ని అంత ఈజీ చేసింది గూగుల్.

ఏ క్వశ్చన్ కి అయినా చాలా సింపుల్ గా సమాధానం చెప్పేస్తుంది.అయితే ఇంత గొప్ప సేవలను అందుబాటులోకి తెచ్చిన గూగుల్ సంస్థ ఇటీవలి కాలంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది.

అప్డేట్ గా ఆలోచిస్తూ పాత పద్దతులను మార్చేస్తూ సరికొత్తగా ముందుకు వస్తుంది.ఇప్పటికే గూగుల్ లో మ్యూజిక్ సేవలను నిలివేయగా తాజాగా.సెర్చింజన్ లో బుక్ మార్క్స్ ఆప్షన్ ను ఎత్తివేసేందుకు సిద్డమైంది.2005 నుండి గూగుల్ ఈ సేవలను యూజర్లకు అందుబాటులో ఉంచింది.అయితే తాజాగా ఈ ఆప్షన్ ను తొలగించాలని గూగుల్ నిర్ణయించుకుంది.సెప్టెంబర్ 30 నుండి ఆప్షన్ ను నిలిపివేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసింది సదరు సంస్థ.

Telugu Bund, Google, Search Engine, Latest-Latest News - Telugu

క్లౌడ్ అధారంగా ఈ సేవలు ఇప్పటి వరకు గూగుల్ తమ యూజర్లకు అందుబాటులో ఉంచింది.వెబ్ పేజీలను, ఆడ్ లెబెల్స్, ఇంపార్టెంట్ నోట్స్ ను బుక్ మార్క్ చేసుకునే అవకాశం ఈ ఆప్షన్ ద్వారా కల్పించింది.అయితే ఈ మధ్య కాలంలో ఈ బుక్ మార్క్ ఆప్షన్ వాడడానికి ఎక్కువ మంది యూజర్లు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఈ ఆప్షన్ తొలగించాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది.ఈ ఆప్షన్ తొలిగిస్తే ఎలా అని టెన్షన్ పడకండి.

దీనికి ఓ పరిష్కారం కూడా గూగుల్ చూపింది.ఎక్స్ పోర్ట్ బుక్ మార్క్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి తమ బుక్ మార్క్స్ ను సేవ్ చేసుకోవాలని సూచించింది.

స్టార్ మార్క్ చేసిన వెబ్ పేజీలు, ప్రదేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని గూగూల్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube