మీ స్మార్ట్ ఫోన్ లో ఆ 17 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి అంటున్న గూగుల్...!

స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న వారికి గూగుల్ సంస్థ కొన్ని జాగ్రత్తలను తెలియజేసింది.మామూలుగా ఆండ్రాయిడ్ యూజర్స్ ఎక్కువగా గూగుల్ ప్లే స్టోర్ కి సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తుంటారు.

 Google Says Delete Those 17 Apps On Your Smart Phone Immediately  Google, Goole-TeluguStop.com

అయితే ఇలా గూగుల్ ప్లే స్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసిన యాప్స్ లో కూడా కొన్ని కొన్ని సార్లు మాల్వేర్ ఉన్న యాప్స్ వస్తుంటాయి.ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు గూగుల్ సంస్థ వాటిని ఫిల్టర్ చేస్తూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తూ ఉంటుంది.

ఇలా కేవలం గూగుల్ సంస్థ మాత్రమే కాకుండా అనేక సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు, అలాగే పరిశోధకులు కూడా ఇలాంటి వాటిపై ఓ కన్ను వేసే ఉంటారు.ఏవైనా హానికరమైన యాప్స్ కనపరచి నట్లయితే వెంటనే గూగుల్ సంస్థకు అప్రమత్తం చేస్తుంటారు చాలామంది.

ఇక తాజాగా Zscaler సెక్యూరిటీ సంస్థ జోకర్ మాల్‌వేర్ కనిపెట్టింది.ఈ మాల్వేర్ ఏకంగా 17 అప్లికేషన్స్ లో ఉన్నట్లు గుర్తించారు.ఇందుకు సంబంధించి గూగుల్ సంస్థకు అప్రమత్తం చేసింది.ఈ జోకర్ మాల్‌వేర్ మన ఫోన్లోని మెసేజ్స్, కాంటాక్ట్ లిస్ట్, ఫోన్ సమాచారాన్ని మొత్తం దొంగలిస్తున్నట్లు తేలింది.

ఈ సమాచారం తెలుసుకున్న వారు ప్రీమియం వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ సేవ లాగిన్ అందించే విధంగా ఉందని తేల్చారు.దీంతో గూగుల్ మొత్తం 17 హానికరమైన యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.

గూగుల్ ప్లే స్టోర్ లోకి ఈ నెలలోనే ఈ యాప్స్ అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ యాప్స్ కు సంబంధించి ఇప్పటికే లక్ష ఇరవై వేల డౌన్లోడ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఈ 17 యాప్స్ జాబితా చూస్తే…

All Good PDF Scanner , One Sentence Translator – Multifunctional Translator , Talent Photo Editor – Blur focus , Desire Translate , Mint Leaf Message-Your Private Message , Private SMS , Unique Keyboard – Fancy Fonts & Free Emoticons , Meticulous Scanner ,Part Message , Tangram App LockDirect Messenger , All Good PDF Scanner , Style Photo Collage , Blue Scanner , Hummingbird PDF Converter – Photo to PDF , Paper Doc Scanner , Care Message గా ఉన్నాయి.

కాబట్టి ఈ 17 యాప్స్ లో ఏవైనా మీ మొబైల్ లో ఉంటే వెంటనే వాటిని తొలగించడం చాలా వరకు శ్రేయస్కరం.

ప్రస్తుతం జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్ కు చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది.ఇదే సమస్య కారణంగా రెండు నెలల క్రితం గూగుల్ ప్లే స్టోర్ నుంచి మొత్తం 11 యాప్స్ ని తొలగించిన విషయం అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత మరోసారి 24 యాప్స్ ను కూడా తొలగించింది.ఇప్పుడు తాజాగా మరోసారి 17 యాప్స్ ను గుర్తించి వాటిని కూడా గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube