ఈ టూల్ కి గూగుల్‌ భయపడుతోందా? ChatGPT ప్రత్యేకత ఏమిటి?

అవుననే చెబుతున్నాయి కొన్ని కొన్ని సర్వేలు.ఇంతకీ అదేమి టూల్ అంటే “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్” అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ChatGPT నవంబరు 30న అంటే ఈ ప్రపంచంలోకి అడుగిడింది.

 ఈ టూల్ కి గూగుల్‌ భయపడుతోందా? Ch-TeluguStop.com

దీని ప్రత్యేకత ఏమంటే అచ్చం మనుషులే రాశారా? అనేంత కచ్చితత్వంతో కంటెంట్ రాయడం.అయితే, అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతున్నాయి లెండి, అది వేరే విషయం.

అయితే రానురాను అది మరింత మెరుగ్గా తయారవుతుంది అనడంలో సందేహం లేదు.ఇప్పుడు దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరోవైపు, కొందరు దీని పట్ల మిక్కిలి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా.

Telugu Chatbot, Chatgpt, Chatgpt Google, Google, Latest, Ai, Ai Chatgpt, Ups-Lat

మరో రెండేళ్లలో గూగుల్‌ను దెబ్బతీసే సత్తా ChatGPTకి ఉందని ఇటీవల జీమెయిల్ ఫౌండర్ పాల్ బచీట్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.దీనిబట్టి మీరే అర్ధం చేసుకోవచ్చు.ఇంటర్నెట్‌లో మీరు ChatGPT రివ్యూలు చదివితే ముఖ్యంగా ‘‘డేంజర్’’, ‘‘ముప్పు’’ అనే పదాలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే మనుషుల మెదడును అనుకరిస్తూ ఈ టూల్ మరింత వేగంగా మెరుగవుతోందని చెబుతున్నారు నిపుణులు.లెర్నింగ్, ఎడ్యుకేషన్, డిజిటల్ సెక్యూరిటీ, ఉద్యోగాలతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థలనూ ఈ టూల్ ప్రభావితం చేసే అవకాశముందని తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

Telugu Chatbot, Chatgpt, Chatgpt Google, Google, Latest, Ai, Ai Chatgpt, Ups-Lat

ఇక ChatGPT అంటే ఏమిటో చాలామందికి తెలియదు, అదొక చాట్‌బోట్.ఎలాంటి ప్రశ్నలకైనా ఖచ్చితత్వంతో కూడిన సమాధానాలు ఇవ్వడం దీని ప్రత్యేకత.ఈ చాట్‌బోట్‌తో మనం కొత్త కంటెంట్‌ కూడా సృష్టించొచ్చు.ఉదాహరణకు చూసుకుంటే, ChatGPT మీకు కష్టం అనుకున్న రుచికరమైన వంటకాలను తేలిగ్గా, అర్థమయ్యేలా వివరించగలదు.అంతేకాకుండా ఉద్యోగాలు వెతుక్కోవడంలో కూడా ఇది మీకు సాయం చేయగలదు.మరో విషయం ఏమంటే ఇది కవితలు, పరిశోధన పత్రాలు కూడా రాయగలదు.

ఎలాంటి ప్రశ్నలకైనా క్షణాల్లో సమాధానం చెప్పగలదు.ఉదాహరణకు ప్రముఖ రచయిత షేక్‌స్పియర్ శైలిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఒక కవిత రాయమని కూడా మీరు ఇక్కడ అడగొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube