యాడ్ వేర్ వైరస్ గుర్తింపు.. గూగుల్ ప్లేస్టోర్ కీలక నిర్ణయం

ప్రముఖ సంస్థ గూగుల్ ప్లేస్టోర్ కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.బుధవారం నిర్వహించిన భద్రత తనిఖీల్లో యాడ్ వైర్ అనే వైరస్ ను గుర్తించింది.

 Google Playstore, Key Decision, Adware Virus-TeluguStop.com

ప్లేస్టోర్ లో ఉన్న 29 యాప్ ల ద్వారా ఈ వైరస్ ఆటోమెటిక్ గా వస్తుందని నిపుణులు వెల్లడించారు.కేవలం మొబైల్ డాటా ఆన్ లో ఉంటే చాలని ఈ వైరస్ మొబైల్ కు సోకుతుందన్నారు.

దీంతో యాడ్ వేర్ నిండిన 29 యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ తొలగించింది.

ఇప్పటివరకూ ఈ యాప్స్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ లో దాదాపుగా 3.5 మిలియన్ల డౌన్లోడ్స్ ఉన్నాయి.సటోరి అనే ఇంటెలిజెన్స్ టీమ్ భద్రత తనిఖీలు జరిపారు.

కాగా ప్లేస్టోర్ లో ఎక్కువగా ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయని గుర్తించారు.యాప్స్ లో బ్లర్ ఆఫ్షన్ ఉన్న యాప్లు హానికారమైనవని సటోరి ఇంటెలిజెన్స్ టీం వెల్లడించింది.

ఫోటో ఎడిటింగ్ కి సంబంధించిన 29 యాప్స్ తో చార్టర్ యూజర్ బ్లర్ అనే కోడ్ తో వైరస్ ఫోన్ లోకి ప్రవేశిస్తుందని, వీటిలో ఏ యాప్ ని అయినా వినియోగదారుడు ఇన్ స్టాల్ చేస్తే ఫోన్లో లాంచ్ ఐకాన్స్ వెంటనే కనిపించకుండా పోతాయని, దీంతో వినియోగదారులకు యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయడం కష్టతరమవుతోందని వారు వెల్లడించారు.

ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్ లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఆటో పిక్చర్ కట్, కలర్ కాల్ ఫ్లాష్, స్క్వేర్ ఫోటో బ్లర్, స్క్వేర్ బ్లర్ ఫోటో, మ్యాజిక్ కాల్ ఫ్లాష్, ఈజీ బ్లర్, ఇమేజ్ బ్లర్, ఆటో ఫోటో బ్లర్, ఫోటో బ్లర్, ఫోటో బ్లర్ మాస్టర్, సూపర్ కాల్ స్క్రీన్, స్క్వేర్ బ్లర్ మాస్టర్, స్క్వేర్ బ్లర్, స్మార్ట్ బ్లర్ ఫోటో, స్మార్ట్ ఫోటో బ్లర్, సూపర్ కాల్ ఫ్లాష్, స్మార్ట్ కాల్ ఫ్లాష్, బ్లర్ ఫోటో ఎడిటర్, బ్లర్ ఇమేజ్ తదితర యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube