గూగుల్ పే యూజర్లకు బంపర్ ఆఫర్..!

ప్రస్తుత సమాజంలో అంతా డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడిపోయారు.చిన్న కిరాణా కొట్టు నుంచి, పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులను డిజిటల్ విధానంలోనే చేస్తున్నారు.

 Google Pay Providing Loan Services For Its Users Details,  Google Pay, Good News-TeluguStop.com

ఫలితంగా ప్రజలంతా పర్సు లేకుండానే, కేవలం ఫోన్ పట్టుకుని ఎంచక్కా షాపింగ్‌కు వెళ్లిపోతున్నారు.కావాల్సినవి కొనుక్కుని, చకచకా పేమెంట్లు పూర్తి చేసేస్తున్నారు.

ఇందుకు సంబంధించి కొన్ని యాప్స్ వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఇలా డిజిటల్ పేమెంట్స్‌ యాప్‌ లలో అగ్రగామి అయిన గూగుల్ పే తమ యూజర్లకు కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తమ యాప్‌ను నిత్యం వినియోగించే యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు గూగుల్ పే మరో ముందడుగు వేసింది.

తగిన క్రెడిట్ స్కోరు ఉంటే చాలు.రూ.లక్ష వరకు క్షణాల్లో లోన్ మంజూరు చేస్తోంది.తమ యూజర్లను మరింత పెంచేందుకు, తమ యాప్‌లో ఎక్కువ లావాదేవీలు జరిపేలా వారిని ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

ఇందుకు డీఎంఐ ఫైనాన్స్ అనే సంస్థ ద్వారా వ్యక్తిగత రుణాలను అందిస్తోంది.ఈ రుణాన్ని వాయిదాల పద్ధతిలో మూడేళ్ల లోపు తిరిగి చెల్లించాలి.

ఈ ఆఫర్ అందరికీ వర్తించదని గూగుల్ పే తెలిపింది.అయితే తమ యాప్‌ను ఎక్కువగా ఉపయోగించే వారు, తరచూ లావాదేవీలు ఎక్కువగా జరిపే వారు దీనికి అర్హులని పేర్కొంది.వీటితో పాటు అవసరమైన సిబిల్ స్కోరు ఉంటే తక్షణమే రుణాలు మంజూరు చేయిస్తామని చెబుతోంది.గూగుల్ పే ప్రకటన పట్ల పలువురు ఆసక్తి చూపుతున్నరు.అర్హత ఉన్న వారంతా నిబంధనలను అనుసరించి క్షణాల్లో లోన్లు పొందుతున్నారు.మీకు కూడా తగిన అర్హతలుంటే లోన్ కోసం ప్రయత్నించండి.

Google Pay Providing Loan Services For Its Users Details, Google Pay, Good News, Bumper Offer, Latest News,loan, Google Pay ,providing Loan Services , Google Pay Users, Google Pay Loans, Digital Payments - Telugu Bumper, Google Pay, Latest, Loan

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube