ఆ సేవ‌ల‌పై వెన‌క‌డుగు వేసిన గూగుల్ పే..

సెర్చింగ్ దిగ్గజం గూగుల్ గురించి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి తెలిసే ఉంటుంది.ఇక దాదాపు అందరు ప్రతీ రోజు ఈ గూగుల్‌ను యూజ్ చేస్తూనే ఉంటారు.

 Google Pay Has Stopped Its Flex Services, Google Pay, Viral News, Google Pay Sto-TeluguStop.com

గూగుల్ తల్లి అన్ని విషయాలు చెప్తుందని పలువురు చెప్తుండటం మనం చూడొచ్చు.కాగా, గూగుల్ స్టార్ట్ చేసిన ఓ ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది.

గతంలో గూగుల్ పే యూజర్స్‌కు ఫ్లెక్స్ సర్వీసులను అందించాలని గూగుల్ భావించింది.ఇందుకుగాను ఫ్లెక్స్ సర్వీసెస్ హెల్ప్‌తో డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలని, వాటి ద్వారా సర్వీస్ అందించాలని అనుకుంది.

యూజర్ గూగుల్ పే ద్వారా ఇతర బ్యాంకులు అందించే చెకింగ్ లేదా సేవింగ్స్ అకౌంట్స్ కోసం సైన్ అప్ చేయడానికిగాను ఫ్లెక్స్ సర్వీసెస్ కస్టమర్స్‌కు అందించాలని గూగుల్ భావించింది.

ఈ ఫ్లెక్స్ సర్వీసుతో యూజర్స్ బ్యాంక్ సేవల నుంచి దృష్టి మరలనుంది.

సెర్చింగ్ దిగ్గజం గూగుల్ తీసుకొస్తున్న ఈ ఫ్లెక్స్ సర్వీసులు పలు బ్యాంకులతో డైరెక్ట్‌గా పోటీలో ఉండే చాన్సెస్ ఉంటాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలోనే ఫ్లెక్స్ సర్వీసు ద్వారా మంత్లీ ఓవర్ డ్రాఫ్ట్ ఫీజులు చెల్లించాలనుకుంది.

ఈ క్రమంలోనే ఆర్థిక సంస్థలతో భాగస్వామిగా ఉండేందుకు ప్లాన్ చేసింది.అయితే, దీని ద్వారా పలు బ్యాంకులకు లాస్ కావచ్చొని పలువురు అంచనా వేస్తున్నారు.

కాగా ఓ జర్నల్ ప్రకారం.గూగుల్ ఫ్లెక్స్ ప్రాజెక్టు పూర్తిగా వాయిదా పడినట్లు సమాచారం.

Telugu Google Pay, Google Pay Flex, Googlepay, Google, Banks, Monthly Draft-Gene

అయితే, ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి తరచూ వాయిదా పడుతూనే ఉంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ కంపెనీ నుంచి వెళ్లిపోవడంతో ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం అందుతోంది.అయితే, ఈ సర్వీసు కోసమై ఆల్రెడీ నాలుగు లక్షల మంది రిజిస్టర్ కావడం గమనార్హం.ఈ క్రమంలో గూగుల్ ఈ ప్రాజెక్టు విషయమై ఎటువంటి డెసిషన్ అఫీషియల్‌గా తీసుకుంటుదో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube